ఖైరతాబాద్‌లో ఈసారి ఒక్క అడుగు వినాయకుడే!
కరోనా వైరస్ మనుషులపైనే కాకుండా దేవుళ్లనూ ప్రభావితం చేస్తోంది. దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి బోసిపోయేలా ఉన్నాడు. కరోనా అదుపులోకి రాకుండా, లాక్ డౌన్ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రజల ఆరోగ్యం కోసం ఈసారి కేవలం ఒక అడుగు ఎత్తు ఉన్న వినాయకుడికే ప్రతిష్టించాలని ఉత్సవ కమిటీ యోచిస్తోంది. ఏటా 50 నుంచి 60 అడుగుల ఎత్తున్న ఖైరతాబాద్ లో ప్రతిష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా భారీ విగ్రహం పెడితే ఎప్పట్లాగే లక్షల మంది వస్తారని, అందుకే విగ్రహం ఎత్తు తగ్గించాలని నిర్వాహకులు భావిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటనేదీ చేయలేదు.
ఆగస్ట్ 22న వినాయక చవితి ఉండడంతో విగ్రహం తయారీలో భాగాం కర్రపూజను మే 18న సాయంత్రం 5 గంటలకు కర్రపూజ జరగనుంది. గణేశుడి ఎత్తు, రూపంపై ఆ రోజు వివరాలు ప్రకటిస్తామని ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్ తెలిపారు. గత ఏడాది ఖైరతాబాద్ గణపయ్య 61 అడుగల ఎత్తులో ద్వాదశాదిత్య మహాగణపతిగా దర్శనమిచ్చాడు.