గణాధిపతి రూపం ఇదీ..... - MicTv.in - Telugu News
mictv telugu

గణాధిపతి రూపం ఇదీ…..

June 18, 2017

ప్రతియేటా  ఖైరతాబాద్ గణేష్ ఎట్లుండనే విషయం  గురించి చానా మంది పట్టించుకోరు. పొడవు, అతని రూపం గురించి కూడా ముందుగాల చానా మందికి  తెలియదు. అయితే  ఈ సారి మీ కోసం ముందుగానే చూపిస్తున్నం. శ్రీ చండీకుమార మహాగణపతిగా దర్శనం ఇవ్వనున్నారు. ఈ సారి 57 అడుగుల గణేశ్ విగ్రహం  నగర వాసులకు దర్శనం ఇవ్వబోతున్నది. గణేష్ ఉత్సవ కమిటీ స్వామి వారి విగ్రహ నమునాను ఈ రోజు విడుదల చేసింది. ఈ విగ్రహానికి కుడివైపు మహాశివుడు, ఎడమవైపు మహిషాసురమర్థిని రూపంలో విగ్రహాలు కను విందు చేయనున్నాయి. కిందటేడు 58 అడుగుల గణపతి విగ్రహాన్ని పెట్టారు. ఇప్పుడు ఒక అడుగు తగ్గించి పెడుతున్నారు. ముందటేడు శివనాగేంద్రుడి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చిన గనణానుథాడు ఈ సారి చండీకుమార మహాగణపతిగా కనుల విందు చేయనున్నాడు.జై బోలో గణేష్ మహాజర్ కి….జై.