Australia: బ్రిస్బేన్‎లో హిందూ ఆలయంపై ఖలిస్తాన్ మద్దతుదారుల దాడి, ఆలయం ధ్వంసం..! - Telugu News - Mic tv
mictv telugu

Australia: బ్రిస్బేన్‎లో హిందూ ఆలయంపై ఖలిస్తాన్ మద్దతుదారుల దాడి, ఆలయం ధ్వంసం..!

March 4, 2023

ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా బ్రిస్బేన్ లోని లక్ష్మీనారాయణ ఆలయంపై దాడి చేశారు. ఈ విధ్వంసం ఘటనలో ఖలిస్తాన్ మద్దతుదారుల హస్తం ఉందని ఆలయ అధికారులు చెబుతున్నారు. రెండు నెలల్లో ఆస్ట్రేలియాలో ఆలయాలపై దాడులు జరగడం ఇది నాలుగోసారి. ఉదయం పూజల కోసం భక్తులు ఆలయానికి చేరుకోగానే ఈ ఘటన గురించి సమాచారం అందింది. ఆస్ట్రేలియా టుడే ప్రకారం ఖలిస్తానీ మద్దతుదారులు బ్రిస్బేన్ కు దక్షిణంగా బర్బాంక్ లోని శ్రీలక్ష్మీ నారాయణ్ ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు పేర్కొంది.

గతంలో కూడా శ్రీరాముని ఆలయం, గాయాత్రీ ఆలయంపై ఖలిస్తాన్ మద్దతుదారులు దాడి చేశారు. అంతేకాదు పూజరులకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. పాకిస్తాన్ లోని లాహోర్ నుంచి ఈ బెదిరింపు కాల్స్ వచ్చినట్లు గుర్తించారు. ఖలీస్తాన్ మద్దతుదారుల చర్య హిందూవులను భయబ్రాంతులకు గురిచేసే విధంగా ఉందని హిందూ మానవ హక్కులు అభివర్ణించాయి. హిందూ దేవాలయాలపై దాడులు తీవ్రవాద సంస్థ సిక్కల ఫర్ జస్టిస్ నమూనా అంటూ హిందూ మావన హక్కుల డైరెక్టర్ జనరల్ సారా ఎల్ గేట్స్ అన్నారు. ఆస్ట్రేలియాలోని హిందూవులను భయబ్రాంతులకు గురిచేయడమే వీరి లక్ష్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు.