ఖమ్మం ఏసీపీ ఓవరాక్షన్.. మహిళా డాక్టర్‌పై దాడి - MicTv.in - Telugu News
mictv telugu

ఖమ్మం ఏసీపీ ఓవరాక్షన్.. మహిళా డాక్టర్‌పై దాడి

March 24, 2020

Lady Doctor

తెలంగాణలో లాక్‌డౌన్ సమయంలో రోడ్లపైకి వచ్చే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ సమయంలోనే ఖమ్మం ఏసీపీ గణేష్ ఓవరాక్షన్ తీవ్ర విమర్శలకు దారి తీసింది. డ్యూటీలో ఉన్న మహిళా వైద్యురాలిపై దాడి చేశారు. సోమవారం రాత్రి వేళలో బయటకు వచ్చిన మమత మెడికల్ కాలేజీ విద్యార్థినిపై దురుసుగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై తోటి డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం టూ టౌన్ ఎదుట ఆందోళన చేపట్టారు. 

ప్రజలు రోడ్లపైకి వస్తున్నారని ఏసీపీ గణేష్ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అటుగా మెడికల్ కాలేజీ విద్యార్థిని కారులో బయటకు వచ్చింది. ఆ కారును ఆపగానే.. తాను డాక్టర్ అని ఐడీ కార్డు చూపించింది. అయినా కూడా వినిపించుకోకుండా దురుసుగా ప్రవర్తించాడు. చేతిలో ఉన్న లాఠీతో ఆమెను కొట్టాడు. వెంటనే ఆగ్రహించిన ఆమె పోలీసులపై తిరగబడింది. దీంతో  ఇరువురి మధ్య కొంతసేపు వాగ్వాదం నడిచింది. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. 

Publiée par Satyavathi Satya sur Lundi 23 mars 2020

అకారణంగా ఆమెను అరెస్టు చేసినట్టు తోటి డాక్టర్లు చెబుతున్నారు. చాలా రోజులుగా కరోనా వార్డులో తాము సేవలు అందిస్తున్నామని, అలాంటి తమపై దాడి చేయడం ఏంటని మండిపడుతున్నారు. డాక్టర్లను ఎవరూ ఆపకూడదని సీఎం కేసీఆర్ చెప్పినా పోలీసులు ఆదేశాలను లెక్కచేయడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఇంత జరిగినా పోలీసులు ఈ అంశాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. దీంతో ఏసీపీ గణేష్ వ్యవహారం విమర్శలకు దారితీసింది. 

సూర్యాపేటలోనూ దాడి :

అటు సూర్యాపేట జిల్లాలోనూ పోలీసులు ఓవరాక్షన్ చేశారు. విధులకు వెళ్తున్న ఇద్దరు నర్సులపై దాడి చేశారు. పాత బస్టాండ్ ప్రాంతంలో తమను ఓ పోలీసు కొట్టినట్టుగా వైద్య సిబ్బంది వెల్లడించారు. ఈ ఘటనపై ఆస్పత్రి సిబ్బంది అంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి తాము వైద్యసేవలు అందిస్తే కొట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. 

Publiée par Satyavathi Satya sur Lundi 23 mars 2020