ఖమ్మం అత్యాచారయత్నం కేసు.. 13 ఏళ్ల బాలిక మృతి - MicTv.in - Telugu News
mictv telugu

ఖమ్మం అత్యాచారయత్నం కేసు.. 13 ఏళ్ల బాలిక మృతి

October 16, 2020

nmnhnm

కామాంధుడి దుశ్చర్యకు ఖమ్మం జిల్లాలో మైనర్ బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఒంటికి నిప్పటించడంతో తీవ్ర గాయాలతో బాధపడిన ఆమె 27 రోజుల పాటు ప్రాణాలతో పోరాడి చివరకు చనిపోయింది. గురువారం రాత్రి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో ఈ విషాదం చోటు చేసుకుంది. దీంతో  బాధిత బాలిక కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేశారు. 

ముస్తాఫా నగర్‌లోని ఓ ఇంట్లో ఈ బాలిక పనిచేస్తోంది. ఆమెపై 26 ఏళ్ల ఇంటి యజమాని కన్నేశాడు.ఇంట్లో ఎవరూ లేని సమయం లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ బాలిక ప్రతిఘటించడంతో కోపంతో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటల్లో కాలుతూ అరుపులు విన్న స్థానికులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. దీనిపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.