ఖమ్మం బాలిక.. ఘోరం వెనుక వెట్టిచాకిరీ కూడా..  - MicTv.in - Telugu News
mictv telugu

ఖమ్మం బాలిక.. ఘోరం వెనుక వెట్టిచాకిరీ కూడా.. 

October 19, 2020

mhmnghf

అత్యాచార యత్నానికి గురై, 70 శాతం కాలిపోయి 17 రోజుల పాటు నరకయాతన అనుభవించిన ఖమ్మం బాలిక మోతె నర్సమ్మ విషాద ఉదంతంలో మరో కోణం వెలుగు చూసింది. నర్సమ్మను వెట్టిచాకిరీ కింద అల్లం సుబ్బారావు ఇంట్లో ఉంచినట్లు వెలుగు చూసింది. తల్లిదండ్రుల పేదరికం, అప్పు భారం, అప్పు ఇచ్చినవాడి దుర్మార్గం దీనికి కారణమని వెల్లడైంది. 

13 ఏళ్ల నర్సమ్మను ఆమె తల్లిదండ్రులు ఖమ్మం నగరంలోని అల్లం సుబ్బారావు ఇంట్లో పనికి పెట్టారు. అతనిగ కొడుకు మారయ్య సెప్టెంబర్‌ 18 ఆమెపై అత్యాచారానికి యత్నించడం, ఆమె ప్రతిఘటించడంతో పెట్రోల్ పోసి కాల్చేయడం తెలిసింది. దీనిపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం గ్రామానికి బాలిక తండ్రి ఉప్పలయ్య పల్లెలో ఇల్లు కట్టుకోడానికి గ్రామానికే చెందిన పేరం రాములు వద్ద రూ. 2 లక్షలు అప్పు చేశాడు. దాన్ని సకాలంలో తీర్చలేకపోవడంతో రాములు  వేధించాడు. పరిష్కారంగా నర్సమ్మను తనకు అప్పగిస్తే  పనిమనిషిగా మార్చి కొంత డబ్బు చెల్లుబాటు చేసుకుంటానన్నాను. ఉప్పలయ్యకు మరోదారిని లేక బిడ్డను అల్లం సుబ్బారావు ఇంట్లో పనికి పెట్టాడు. పేరయ్య.. సుబ్బారావు నుంచి రూ. 50,000  తీసుకున్నాడు. బాలికపై ఘోరం జరిగాక పంచాయతీ ద్వారా బేరసారాలు జరిగాయి. రాములు వల్లే తమ బిడ్డను కోల్పోయామని ఉప్పలయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.