Khammam growing towards developing
mictv telugu

ఖమ్మం ప్రజల జీవితాలను మార్చేసిన తెలంగాణ సర్కార్

January 18, 2023

Khammam growing towards developing

తెలంగాణ వచ్చాక ఖమ్మం రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి. అప్పటివరకు నిర్లక్ష్యానికి గురైన ఈ జిల్లా ఇప్పుడు కళకళలాడుతోంది. ఉమ్మడి పాలనలో దాదాపు అన్ని తెలంగాణ జిల్లాలు పెద్దగా అభివృద్ధి చెందలేదనే చెప్పాలి. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ మొత్తం రాష్ట్రాన్నే మార్చేశారు. అలాగే ఖమ్మం మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఖమ్మం జిల్లాకు నిధుల వరద పారించారు. సంక్షేమానికి పెద్ద పీట వేస్తూనే జిల్లాను అభివృద్ధి బాట పట్టించారు. జిల్లాలో సాగు సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో భద్రాద్రి జిల్లాలోని అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద సీతారామ ప్రాజెక్టును నిర్మాణాన్ని శరవేగంగా పూర్తిచేస్తున్నారు. జిల్లాలోని నిరుద్యోగులకు ఉన్నచోటే ఐటీ కొలువులు వచ్చేలా ఐటీహబ్‌ను ఏర్పాటు చేశారు. ఖమ్మం నగరాన్ని హైదరాబాద్‌స్థాయిలో అభివృద్ధి బాటపట్టించి ఆదర్శంగా నిలిపారు.

సీతారామ ప్రాజెక్టు:

ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో సాగుమీద తెలంగాణ సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టింది. భద్రాద్రి జిల్లాలోని అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు దగ్గర గోదావరి మీద సీతారామ ప్రాజెక్టును నిర్మిస్తున్నది. ఈ ప్రాజెక్టుకు తెలంగాణ సర్కారు బోలెడు నిధులను ఇచ్చింది.అంతేకాదు పనులు వేగంగా జరిగేందుకు ఆదేశాలను కూడా జారీ చేసింది. ఇందులో భాగంగా పాలేరు లింక్‌ కెనాల్‌ పనులను వేగంగా చేపడుతున్నారు. ఖమ్మం జిల్లాలోని ఐదు మండలాలకు చెందిన 15 గ్రామాల్లో 1,717 ఎకరాల భూ సేకరణ అవసరం కాగా, ఇప్పటివరకు 1,570 ఎకరాలకు అవార్డు జారీ చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే గోదావరి నీళ్ళు పాలేరు రిజర్వాయర్ లోకి వస్తాయి. దీంతో కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం పూర్తవుతుంది. పాలేరు వరకు నీళ్ళు రావడం వలన సీతారామ కాలువ ద్వారా జిల్లాలోని జలాశయాలు నిండుతాయి. పంటలు సమృద్ధిగా పండుతాయి. దీనివల్ల ఖమ్మంలో సుమారు 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.

రహదారులు:

ఎనిమిదేళ్ళల్లో ఖమ్మం అన్ని రకాలుగా అభివౄద్ధి చెందింది. మంచి రోడ్లు సంపాదించుకుంది. జాతీయ రహదారులు పడ్డాయి. కొత్త రైల్వే లైన్లు కూడా వచ్చాయి. జిల్లాలో రహదారుల అభివృద్ధికి తెలంగాణ సర్కారు రూ.890 కోట్లు మంజూరు చేసింది. 10 బ్రిడ్జి కం చెక్‌డ్యాం పనులకు 119 కోట్లతో పనులు పూర్తయ్యాయి. సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు నాలుగు లేన్ల జాతీయ రహదారి విస్తరణకు 306 ఎకరాల భూ సేకరణ పూర్తిచేశారు. 1,039 కోట్లతో ఖమ్మం-కోదాడ జాతీయ రహదారికి కూడా భూ సేకరణ పూర్తయ్యింది. ఖమ్మం దేవరపల్లి గ్రీన్‌ ఫీల్డ్‌కు రూ.687 కోట్లతో భూసేకరణ చేశారు. భద్రాచలం నుం చి సత్తుపల్లి వరకు కొత్త రైల్వే లైన్‌ నిర్మాణానికి 308 ఎకరాలను సేకరించి, పనులు పూర్తి చేశారు.

ఐటీ హబ్:

మరోవైపు ఉమ్మడి ఖమ్మంజిల్లా నిరుద్యోగులకు ఉన్నచోటే ఉద్యోగాలు కల్పించేందుకు ఇల్లెందు క్రాస్‌రోడ్డులో ఐటీ హబ్‌ ఏర్పాటు చేశారు. దీనికోసం రూ.25 కోట్లు కేటాయించారు. ఈ హబ్ ను 2020లోనే కేటీఆర్ ప్రారంభించారు. దీని ద్వారా నైపుణ్యం గల యువతకు ఉపాధి కల్పిస్తున్నారు.

సంక్షేమ పథకాలు:

ఖమ్మం జిల్లాలో పథకాల రూపంలో సీఎం కేసీఆర్ వరాల జల్లులు కురిపించారు. ఆసరా పింఛన్‌ పథకం కింద వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ, గీత కార్మికులకు రూ. 2,016, దివ్యాంగులకు రూ. 3,016 చొప్పున చెల్లిస్తున్నారు. కల్యాణలక్ష్మి ద్వారా 7,371 మంది ఆడపిల్లలకు రూ.74 కోట్లు, షాదీముబారక్‌ ద్వారా 346 మంది లబ్ధిదారులకు రూ.3.46 కోట్లు అందజేశారు.దళిత బంధు పథకం ద్వారా జిల్లాలో చింతకాని మండలంలోని 3,440 మందికి, మిగిలిన నియోజకవర్గాల్లో 483 మంది లబ్ధిదారులకు దళితబంధు యూనిట్లను మంజూరు చేశారు. జిల్లాలో 5,243 డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాన్ని పూర్తిచేశారు. 4,790 మంది నిరుపేదలకు ఇండ్ల పట్టాలు అందజేశారు. జిల్లాలో రైతు పెట్టుబడి సాయం కింద 3,07,620 మంది రైతులకు రూ.355.43 కోట్ల్లను వారి ఖాతాల్లో నేరుగా జమ చేశారు. రైతు బీమా కింద 612 మంది నామినీలకు రూ. 3.60 కోట్లను అందజేశారు.

రైతులకు నిధులు:

జిల్లాలో రైతులను నిలబెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 355.43 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ డబ్బును సుమారు 3, 07, 620 రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేశారు. రైతు బీమా కింద 612 మంది నామినీలకు రూ. 3.60 కోట్లను అందజేశారు. 2022-23 సంవత్సరానికి గాను 2,94,986 మెట్రిక్‌ టన్నుల ఎరువులను రైతులకు అందించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లాలో 129 క్లస్టర్లలో రూ.29 కోట్లతో రైతు వేదికలను నిర్మించారు. ఇదే కాకుండా రైతులు పండించిన పంటలకు రక్షణగా అనేక గోదాములను కూడా నిర్మించింది తెలంగాణ ప్రభుత్వం. రఘునాథపాలెం మండలంలో వేర్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా 20 వేల మెట్రిక్‌ టన్నులతో రూ.14.90 కోట్ల వ్యయంతో మూడు గోదాములు నిర్మించింది.

బస్ స్టేషన్:

ఖమ్మం బస్ స్టేషన్ ఇప్పడు అత్యంత అధునాతనంగా తయారైంది. 25 కోట్ల వ్యయంతో 30 ఫ్లాట్ ఫారాలతో బస్ స్టాండ్ ను తీర్చిదిద్దారు. ఇందులో హోటళ్ళు, షాపింగ్ మాల్స్, రెస్ట్ రూమ్స్, పార్కింట్ లాట్స్ లాంటి అన్ని సౌకర్యాలను కల్పించారు. హైదరాబాద్ తర్వాత ఇదే పెద్ద బస్ట్ స్టాండ్.

ఇవే కాకుండా జిల్లాలో గత ఏడాది 55.87 లక్షలు, ఈ ఏడాది 1.13 కోట్ల మొక్కలు నాటారు. ప్రతి మండలంలో 5 బృహత్‌ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. 1,308 కోట్ల రూపాయలతో తో చేపట్టిన మిషన్‌ భగీరథ పథకంతో 969 గ్రామాలకు తాగునీటి సరఫరా చేస్తున్నారు. నగరం నడిబొడ్డున 4 ఎకరాల స్థలంలో 22 కోట్లతో నూతన కార్పొరేషన్‌ భవనాన్ని నిర్మించారు. ఖమ్మం పాత కార్పొషన్‌ కార్యాలయంలో లైబ్రరీ ఏర్పాటు చేశారు. 8.75 కోట్లతో దగ్గర కేబుల్‌ బ్రిడ్జిని, మరో 2 లక్షలతో మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌ను నిర్మించారు. 93.70 లక్షలతో జడ్పీసెంటర్‌ నుంచి ఐటీ హబ్‌ వరకు పుట్‌పాత్‌ జోన్‌ నిర్మించారు. దానవాయిగూడెంలో 5.48 కోట్లతో మానవ వ్యర్థాల శుద్ధీకరణ కర్మాగారాన్ని నిర్మించారు.నగరంలో రూ. 9 కోట్లతో 25,520 ఎల్‌ఈడీ వీధిదీపాలు ఏర్పాటు చేశారు. రూ.35 కోట్లతో 6.5 కిలో మీటర్ల బీటీ రోడ్డు, 9.6 కిలో మీటర్ల సీసీ రోడ్డు నిర్మించారు. అన్ని డివిజన్ల అభివృద్ధికి రూ.7.52 కోట్లను విడుదల చేశారు.

 

ALSO READ: టాస్ గెలిచిన టీమిండియా.. ఫస్ట్ బ్యాటింగ్ మనదే

‘నాతో చేతకాక.. నా కొడుకుపై కేసు పెట్టిస్తావా..?’ కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్

మీరు సుకన్య సమృద్ధి స్కీంలో చేరాలనుకుంటున్నారా..అయితే మీకు గుడ్‎న్యూస్..!