డెంగీ జ్వరంతో ఖమ్మం న్యాయమూర్తి మృతి - MicTv.in - Telugu News
mictv telugu

డెంగీ జ్వరంతో ఖమ్మం న్యాయమూర్తి మృతి

October 21, 2019

రాష్ట్రంలో డెంగీ జ్వరాల కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. గతేడాదిక కంటే దాదాపు రెండు రెట్లు పెరిగినట్లు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా ఖమ్మం పట్టణ రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయమూర్తి ఎం.జయమ్మ(45) ఆదివారం రాత్రి డెంగీ జ్వరంతో మృతిచెందారు. 

judge jayamma.

జయమ్మ సొంతూరు మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వడ మండలం అయోధ్యనగర్‌. హైకోర్టు విభజనలో భాగంగా ఆమె సత్తెనపల్లి నుంచి ఖమ్మం కోర్టుకు బదిలీపై వచ్చారు. గత కొన్ని రోజులుగా డెంగీ జ్వరంతో బాధపడుతున్న జయమ్మ ఖమ్మంలో చికిత్స పొందారు. పది రోజుల క్రితం పరిస్థితి తీవ్రం కావడంతో ఆమెను సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం రాత్రి పరిస్థితి విషమించడంతో ఆమె తుదిశ్వాస విడిచినట్లు డాక్టర్లు తెలిపారు. ఆమెకు భర్త, ఇద్దరు కొడుకులు ఉన్నారు. జయమ్మ మృతికి పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు విచారణం వ్యక్తం చేశారు.