కేసు పెట్టడానికి వచ్చి కానిస్టేబుల్ వేలు కొరికాడు - MicTv.in - Telugu News
mictv telugu

కేసు పెట్టడానికి వచ్చి కానిస్టేబుల్ వేలు కొరికాడు

October 22, 2019

 

Constable ..

కేసు పెట్టడానికి వచ్చి ఓ వ్యక్తి ఏకంగా కానిస్టేబుల్ వేలును కొరికాడు. ఖమ్మం జిల్లాలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. అంతటితో ఆగకుండా ఆ వ్యక్తి తనతో పాటు వచ్చిన వ్యక్తులు అంతా కలిసి కానిస్టేబుల్‌ను విచక్షణా రహితంగా చితకబాదారు. తోటి సిబ్బంది వచ్చి వారిని విడిపించడంతో వెంటనే అక్కడి నుంచి వారు పారిపోయారు. ఇంత జరిగినా ఈ వ్యవహారాన్ని పోలీసులు బయటకు రాకుండా గోప్యంగా ఉంచడంతో పలువురు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

సోమవారం అర్థరాత్రి పోలీస్ స్టేషన్‌కు ఓ వ్యక్తి కొంత మందిని వెంటపెట్టుకొని వచ్చి కేసుపెట్టాలని కోరాడు. వెంటనే డ్యూటీలో ఉన్న మసూద్ అలీ కేసు వివరాలు రాసుకునేందుకు సిద్ధం అయ్యాడు. ఆ సమయంలో కానిస్టేబుల్‌తో గొడవపడిన ఆ వ్యక్తితో పాటు వచ్చిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మసూద్  చిటికెన వెలిని బలంగా కొరకడంతో అది తెగిపోయింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ తొడ, చేతికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. వెంటనే అతన్ని హాస్పిటల్‌కు తరలించి చికిత్స చేయించారు. అయితే గొడవకు కారణాలేంటీ.? కానిస్టేబుల్‌పై దాడి జరిగినా ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు. ముందు గొడవ ప్రారంభించింది ఎవరనేది తెలియాల్సి ఉంది.