ఖమ్మంలో ఆర్టీసీ బస్సుల ఢీ, డ్రైవర్ మృతి - MicTv.in - Telugu News
mictv telugu

ఖమ్మంలో ఆర్టీసీ బస్సుల ఢీ, డ్రైవర్ మృతి

September 10, 2019

Khammam Rtc Bus

రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీ కొనడంతో డ్రైవర్ మరణించగా.. ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఖమ్మం జిల్లా తల్లంపాడు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం 1 గంట ప్రాంతంలో ప్రమాదం  జరిగింది. గాయపడిన వారికి ఖమ్మం ఏరియా హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. 

ఖమ్మం నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఏలూరు డిపోకు చెందిన బస్సు తాండూరు డిపో బస్సును తల్లంపాడు వద్ద ఢీ కొట్టింది. మూలమలపు ఉండటంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో డ్రైవర్లు క్యాబిన్లలో ఇరుక్కుపోగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో గాయపడిన వారిని చికిత్స కోసం తరలించారు. ఏలూరు బస్సు డిపో డ్రైవర్ కిరణ్ ప్రమాద స్థలంలోనే మరణించాడు.  మరో డ్రైవర్‌ను క్యాబిన్ నుంచి అతి కష్టం మీద బయటకు తీశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.