కిరోసిన్ పోసుకుని ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం - MicTv.in - Telugu News
mictv telugu

కిరోసిన్ పోసుకుని ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

October 12, 2019

తెలంగాణ ఆర్టీసీ సమ్మె వరుసగా ఏడో రోజూ సాగుతోంది. సమ్మెలో పాల్గొంటున్న వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని, వారితో అసలు చర్చలు కూడా జరపబోమని సీఎం కేసీఆర్ తేల్చిచెబుతున్నారు. ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదన్న మనస్తాపంతో ఓ ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యకు యత్నించాడు.

ff

ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకున్నాడు. 90 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి ఖమ్మం డిపోలో విధులు నిర్వహిస్తున్నాడు. సమ్మెను ప్రభుత్వం పట్టించుకోకపోవడమే కాకుండా సమ్మె చేస్తున్న కార్మికులపై కఠిన చర్యలు తీసుకోవడం ఆయన మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రి వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.