Kharge Becomes New Congress President
mictv telugu

విధేయుడు ఖర్గేకే కాంగ్రెస్ పగ్గాలు..పార్టీ రాత మారుతుందా?

October 19, 2022

Kharge Becomes New Congress President

కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు వచ్చారు.24 ఏళ్ల తర్వాత నాన్ గాంధీ ఫ్యామిలీ నుంచి విధేయుడు ప్రెసిడెంట్ అయ్యారు..కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే ఎన్నికయ్యారు. ప్రత్యర్థి శశిథరూర్ పై బంపర్ మెజార్టీతో గెలిచారు.ఏడువేలకు పైగా ఓట్ల మెజారిటీ విజయం సాధించారు.ఇది అందరూ ఊహించిందే.కానీ మల్లికార్జున ఖర్గే రాకతో కాంగ్రెస్ ఫేట్ మారుతుందా?పార్టీ రాతని మార్చేస్తారా?

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఈ నెల 17న ఎన్నికలు నిర్వహించారు.9500 ఓట్లు పోల్ అయ్యాయి. బుధవారం వెల్లడించిన ఫలితాల్లో మల్లికార్జున్ ఖర్గేకి 7,897 ఓట్లు,ప్రత్యర్థి శశిథరూర్ కు 1072 ఓట్లు వచ్చాయి. 416 ఓట్లు చెల్లలేదని పార్టీ వర్గాలు ప్రకటించాయి. 139 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో 24 ఏళ్లు తర్వాత గాంధీకుటుంబయేతర వ్యక్తి అధ్యక్షుడు అయ్యారు.పార్టీ ఇప్పుడు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. రెండు,మూడు రాష్ట్రాల్లో తప్ప దేశమంతా కాంగ్రెస్ వాష్ అవుట్ అయింది.కేడర్ అంతా పార్టీని నమ్ముకున్న ఉన్నా..నడిపించే నాయకుడు లేరు.గ్రూప్ తగాదాల్ని పరిష్కరించే నేత లేరు.కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్..భూతద్దం వేసి వెతికినా కనపించడు. సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్న పార్టీని సమర్థంగా నడిపించలేకపోయారు. ఇంతకుముందులా ఆరోగ్యం సహకరించకపోవడం కూడా ఓ కారణం.ఇక రాహుల్ ఎక్కడ అడుగు పెట్టినా కాంగ్రెస్ కు కలిసి రాలేదు. యూపీ ఎన్నికల్లో చివరి అస్త్రమైనా ప్రియాంకను ప్రయోగించినా ఫలితం రాలేదు.అందుకే జీ23 ఆశించినట్టు కొత్త అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించారు.విధేయుడికే పగ్గాలు అప్పగించారు.
విధేయుడు పార్టీని గట్టేక్కిస్తారా?

గాంధీ ఫ్యామిలీకి మల్లికార్జున ఖర్గే వీరవిధేయుడు. మేడం మాట గీత దాటరు.యువరాజు మాటకు ఎదురుచెప్పరు.పార్టీలో మంచి పేరు వుంది.ఇంకేం సోనియాకు కావాల్సింది ఇదే.పైకి అధ్యక్ష ఎన్నిక నిర్వహించాం.గాంధీయేతర కుటుంబం వ్యక్తికే పార్టీ పవర్ ఇచ్చారు. జీ23 కోరుకున్నది చేశామంటూ సంకేతాలు ఇచ్చారు.మల్లికార్జున ఖర్గే ముందున్నది ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రొకడైల్ ఫెస్టివలే.ఇప్పుడు కాంగ్రెస్ పైకి లేపడం మామూలు విషయం కాదు. కేంద్రంలో బీజేపీని ఢీ కొట్టాలంటే ఈజీ టాస్క్ కాదు. పది మంది సోనియాలు, మరో పదిమంది ఖర్గేలు వచ్చినా కాంగ్రెస్ ని ట్రాక్ లో పడేయలేరు.ఎందుకంటే మోదీషా ధ్వయం అంతగా కాంగ్రెస్ ని కోలుకోలేని దెబ్బకొట్టింది. దేశ మ్యాప్ లో అంతా కాషాయకరణ చేసేశారు. ఉన్నా ఒకటి,రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ని ఫేడ్ అవుట్ చేయడమే లక్ష్యంగా మోదీషా అడుగులేస్తున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున ఖర్గే ముందు అనేక సవాళ్లు ఉన్నాయి.

Kharge Becomes New Congress President

ఖర్గే ముందు ఉన్న సవాళ్లు…

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కేడర్ లో కొత్త జోష్ తేవాలి,రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతల మధ్య సయోధ్య కుదిర్చాలి. కార్యకర్తలతో ఆత్మవిశ్వాసం నింపాలి.పార్టీని పూర్తిగా పట్టాలు ఎక్కించాలి. బలోపేతం చేయడంతో పాటు… ఉన్న కేడర్ ని నిలుపుకోవాలి.దీనికోసం ముందుగా డిల్లీ స్థాయిలో పార్టీ పటిష్ట పరుచాలి. విభేదాలు పక్కన పెట్టి కాంగ్రెస్ నేతలు అంతా కలిసి పనిచేసేలా చూడాలి.ఇవే ఖర్గే ముందు పెద్ద సవాళ్లు. బీజేపీని దీటుగా ఢీ కొట్టాలంటే

బలమైన నాయకుల్ని తెరమీదకి తేవాలి. జనరల్ ఎలక్షన్స్ కు సమయం కూడా ఎక్కువ లేదు. ఈలోపే పార్టీ నేతల్ని దారిలోకి తేవాలి. 2024 ఎన్నికల్లో గట్టి పోటీని ఇచ్చే నేతల్ని తయారు చేయాలి. ఇదే ఖర్గేకు టఫ్ టాస్క్.

దేశంలో ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. బీజేపీకి వచ్చే ఎన్నికల్లో కనీసం పోటీ ఇవ్వలేని స్థితిలో ఉంది. అంతే కాదు ఇంకో పదేళ్లవరకు
బీజేపీ వ్యతిరేక కూటమిని ఒక్కటి చేస్తారా?

మోడీ అండ్ కోని ఢీకొట్టలేరనే టాక్ ఉంది. ఇక యూపీయే పరిస్థితి అంతే.ఒకప్పుడు వీరి వెంటనడిచినవాళ్లు…ఇప్పుడు కాంగ్రెస్ నే తమ వెంటరావాలంటున్నారు. బీజేపీ వ్యతిరేక కూటమిని కాంగ్రెస్ ఒక్కటి చేయలేకపోతోంది. కలిసొచ్చేవాళ్లనూ కలుపుకోలేకపోతుంది. ఇప్పుడు ఖర్గేకు ఇదే అతిపెద్దసవాల్.పార్టీ పటిష్టంతో పాటు బీజేపీ వ్యతిరేక కూటమిని ఒక్కటి చేయాలి. రాబోయే ఎన్నికల్లో బీజేపీ కి టఫ్ ఫైట్ ఇచ్చేలా కాంగ్రెస్ శ్రేణుల్ని నడిపించాలి. యూపీయే భాగస్వామ్య పక్షాల్ని కలుపుకుపోవాలి. దేశంలో బీజేపీకి ప్రత్యమ్నాయశక్తి రావాలి. కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటున్నది ఇదే. చూడాలి కొత్త అధ్యక్షుడితోనైనా కాంగ్రెస్ ఫేట్ మారుతుందేమో.