Home > Featured > టోల్ గేట్ ఉద్యోగినికి చెంపదెబ్బ.. రచ్చరచ్చ (వీడియో)

టోల్ గేట్ ఉద్యోగినికి చెంపదెబ్బ.. రచ్చరచ్చ (వీడియో)

టోల్‌గేట్ల వద్ద మనుషులకు సహనం జర్రున జారిపోతోంది. అటు వాహనదారులు, ఇటు టోల్ సిబ్బంది ఆవేశకావేశాలకు పోతున్నారు. ఫలితంగా గొడవలు కాస్తా దాడులు, కాల్పులకు దారితీస్తున్నాయి. చిల్లర విషయంలో గొడవపడిన కారు డ్రైవర్ ఒకడు.. టోల్ గేట్ ఉద్యోగినిపై చెయ్యి చేసుకున్నాడు. అమ్మాయి అని కూడా చూడకుండా కోపంతో రెచ్చిపోయాడు. ఆమె అతనికి చుక్కలు చూపించింది. ఇద్దరూ గొడవపడిన సీన్లు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

హరియాణా రాష్ట్రంలోని ఖేర్కి దౌలా టోల్‌ఫ్లాజా వద్ద ఈ సంఘటన జరిగింది. ఈ రోజు ఉదయం టోల్ ఫీజు విషయంలో డ్రైవరుకు, ఉద్యోగినికి మధ్య విగ్వాదం జరిగింది. కోపం తట్టుకోలేకపోయిన డ్రైవర్ ఆమెను చెంపదెబ్బ కొట్టాడు. ఆమె కూడా అతణ్ని కొట్టడానికి యత్నించింది. బూత్ లోంచి బయటకి వచ్చి పని చెప్పింది. సెక్యూరిటీ సిబ్బంది డ్రైవర్‌ను అడ్డుకుని అక్కడి నుంచి పంపేశారు. ఖేర్కీ దౌలా వద్ద ఇలాంటి సీన్లు కొత్తేమీ కాదు. రెండు నెలల కిందట కూడా ఓ డ్రైవర్.. అక్కడి సిబ్బందితో తగువెట్టుకున్నాడు.

Updated : 29 Aug 2019 6:54 AM GMT
Tags:    
Next Story
Share it
Top