కుప్పకూలిన సర్వాయి పాపన్న కోట - MicTv.in - Telugu News
mictv telugu

కుప్పకూలిన సర్వాయి పాపన్న కోట

October 15, 2020

nnbgvn

రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు అపారమైన నష్టం ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో కట్టడాలు కూలిపోయాయి. ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ఈ క్రమంలోనే చారిత్రక కట్టడమైన  సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ కట్టిన కోట కూడా నేలమట్టమైంది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపూర్‌ గ్రామంలో  గురువారం ఉదయం చోటు చేసుకుంది. అంతా చూస్తుండగానే కూలిపోతుండటంతో దీన్ని స్థానికులు వీడియో తీశారు. ఈ ఘటనలో నాలుగు ఇండ్లు స్వల్పంగా ధ్వంసం అయ్యాయి.  

ఈ ప్రమాదాన్ని ముందే గమనించిన స్థానికులు ఇళ్లు ఖాళీ చేసి బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత కొంతసేపటికి అది కూలిపోయింది. 18వ శతాబ్దంలో రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపూర్‌ గ్రామంలో  సర్దార్ సర్వాయి పాపన్న దీన్ని కట్టించారు. కాలం గడిచే కొద్ది పురాతనమైపోయింది. ఈ కోటను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక ప్రాంతంగా ప్రకటించింది. అభివృద్ధి కోసం 4.5 కోట్లు రూపాయలు కూడా  మంజూరు చేసింది. అయినప్పటికీ ఎటువంటి అభివృద్ధి జరగలేదు.  స్థానికులు అధికారులకు చెప్పినా ఆరు సంవత్సరాలుగా ఎవరూ పట్టించుకోలేదు. ఈ క్రమంలో వర్షాల కారణంగా కుప్పకూలిపోయింది. దీనిపై స్థానికులు విచారం వ్యక్తం చేశారు.