ఖుష్బూపై కోడిగుడ్ల దాడి - MicTv.in - Telugu News
mictv telugu

ఖుష్బూపై కోడిగుడ్ల దాడి

March 1, 2018

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తలకెక్కే నటి, కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూపై దాడి జరిగింది. బుధవారం ఆమె మేటూర్ కోర్టుకు హాజరు కావడానికి వెళ్తుండగా గుర్తుతెలియని దుండగులు ఆమె కారుపై పెద్ద సంఖ్యలో కోడిగుడ్లు, టమాటాలు విసిరారు. అయితే ఆమెకు ఎలాంటి గాయాలూ కాలేదు.కన్యత్వం వంటి అంశాలపై 2005లో ఖుష్బూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘చదువుకున్నవాడు తనకు కాబోయే భార్య కన్యగానే ఉండాలని పట్టుబడడం. పెళ్లికి ముందు సెక్స్ మంచిదే..’ అని అన్నారు.  పట్టాలి మక్కల్‌ కట్చి దీనికి అభ్యంతరం తెలుపుతూ మేటూర్ కోర్టులో దావా వేసింది.  కేసు విచారణ కోసమే ఆమె కోర్టుకు హాజరైంది. ఆమెపై జరిగిన దాడిని అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. కోర్టు విచారణకు వెళ్తున్న వ్యక్తిపై దాడి చేయడం సరికాదంటూ పట్టాలి మక్కల్ కచ్చికి చెందిన 40 మందిపై కేసు పెట్టారు. మరోపక్క.. కోర్టు ఈ కేసును 6వ తేదీకి వాయిదా వేసింది.