మందుకొట్టి చిందేసిన ఖుష్బూ.సుకన్య. - MicTv.in - Telugu News
mictv telugu

మందుకొట్టి చిందేసిన ఖుష్బూ.సుకన్య.

February 13, 2018

నటి ఖుష్బూ, సుకన్యలు లేడిపిల్లల్లా చెంగుచెంగున చిందులేశారు. వారు చిందేయటంలో వింతేముందనుకునేవాళ్ళు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఫూటుగా మందు కొట్టి కుర్ర హీరోయిన్ల మాదిరి, ఏమాత్రం హుషారు తగ్గకుంగా డాన్స్ చేసి అక్కడున్న వారిని విస్మయానికి గురి చేశారు. చెన్నైలోని సవేరా హోటల్‌లో ఓ విందు సందర్భంగా వీరిద్దరూ మద్యం మత్తులో సూపర్ హిట్ హిందీ సాంగ్‌ ‘ పియా తూ అబ్‌‌తో ఆజా ‘ పాటకు స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాస్త వయసు మీదపడినా, ఒళ్ళు చేసినా అస్సలు తగ్గలేదు. వీరితో పాటు మనోబాల కూడా వున్నారు.  వీరి మత్తునాట్యాన్ని చూసినవారంతా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇద్దరి స్టెప్పుల్లో ఏమాత్రం గ్రేస్ తగ్గలేదని అభినందనలు గుప్పిస్తున్నారు. కొందరేమో సీనియర్ నటీమణులై వుండి ఇదేం పని అని చెవులు కొరుక్కుంటున్నారు. ఆ వీడియోను మీరూ చూడొచ్చు.