ఖుష్బూపై దివ్యాంగుల ఆగ్రహం.. కారణమిదే - MicTv.in - Telugu News
mictv telugu

ఖుష్బూపై దివ్యాంగుల ఆగ్రహం.. కారణమిదే

October 15, 2020

నటి నటి ఖుష్బూ ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెల్సిందే. ఇటీవల ఢిల్లీలో బీజేపీ అధ్యక్షడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. ఇదిలా ఉంటే ఆమెపై దివ్యాంగుల హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆమె కాంగ్రెస్ పార్టీని వీడుతూ.. ఆ పార్టీకి మేధో వైకల్యం ఏర్పడిందని, కాంగ్రెస్ నేతలు మానసిక వికలాంగులని విమర్శలు చేశారు. 

ఖుష్బూ వ్యాఖ్యలపై ‘నేషనల్ ఫ్లాట్‌ఫార్మ్ ఫర్ ది రైట్స్ ఆఫ్ ది డిసబుల్డ్’ అనే సంఘం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఖుష్బూ వ్యాఖ్యలు మానసిక వికలాంగులను కించపరిచేలా ఉన్నాయని పేర్కొంది. దాంతో ఖుష్బూ క్షమాపణలు తెలుపుతూ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అయినా కూడా దివ్యాంగుల హక్కుల సంఘాలు మాత్రం శాంతించడం లేదు. సంఘం కార్యకర్తలు ఖుష్బూపై 50 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.