దక్షిణ కొరియా కార్ల కంపెనీ కియా దేశీయ విద్యుత్ వాహనాల రంగంలోకి దిగింది. ఈవీ 6 పేరుతో తొలి ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. రెండు వేరియంట్లలో లభ్యమయ్యే ఈ కార్లలో జీటీ ఆర్డబ్య్లూడీ (రేర్ వీల్ డ్రైవ్) ధరను రూ. 59.95 లక్షలుగా, జీటీ ఏడబ్య్లూడీ (ఆల్ వీల్ డ్రైవ్) ధరను రూ. 64.95 లక్షలుగా నిర్ణయించింది.
ఇండియాలో వంద కార్లను విడుదల చేయగా అన్నీ బుక్కయిపోయాయి. అంతేకాక, ఇప్పటిదాకా 355 ప్రిబుకింగ్క్స్ సాధించినట్టు కంపెనీ తెలిపింది. ఈ కార్లు ఒకసారి చార్జింగ్ చేస్తే మొదటి వేరియంట్ 528 కిలోమీటర్లు, రెండో వేరియంట్ 425 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని తెలిపింది. రెండు మోడళ్లలోనూ 77.40 కిలోవాట్ బ్యాటరీలను అమర్చినట్టు ఓ ప్రకటనలో వివరించింది. వీటితో పాటు 8 ఎయిర్ బ్యాగులు, 360 డిగ్రీల కెమెరా, ముందు వెనుక పార్కింగ్ సెన్సార్లు, అడ్వాన్స్డ్ అసిస్టెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి.