బాలీవుడ్ లో మరో సెలబ్రిటీ వివాహం జరగబోతోందా? గుపగుసలు వింటుంటే అదే నిజమనిపిస్తోంది. సిద్ధార్ధ మల్హోత్రా, కియారా అద్వానీలు కొంత కాలంగా డేట్ లో ఉన్నట్లు బీటౌన్ లో వార్తలు షికార్లు చేస్తూనే ఉన్నాయి. కానీ వీళ్ళు మాత్రం తమ రిలేషన్ షిప్ మీద ఎప్పుడూ నోరు విప్పలేదు. అయితే ఇప్పుడు తాజాగా కొత్త వార్త ఒకటటి బయటకు వచ్చింది. ఈ జంట ఇప్పుడు పెళ్ళిపీటలు ఎక్కబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఫిబ్రవరి 6న సిద్-కియారా వివాహం జరగనుందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.
అందరిలాగే సిద్-కియారాలు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నారుట. జెసల్మైర్ లో ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో వీళ్ళు పెళ్ళి చేసుకుంటున్నారని టాక్. 4, 5 తారీకుల్లో సంగీత్, హల్దీ వేడుకలు దుబాయ్ లో చేసుకుంటున్నారు. ఇక పెళ్ళికి మాత్రం ఇరు కుటుంబాలు, సన్నిహిులు మాత్రమే హాజరవుతారని వార్తా కథనాలు. పెళ్ళి తర్వాత సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తారుట. అలాగే పెళ్ళి మొత్తాన్ని ఒక డాక్యుమెంటరీగా రూపొందిస్తారని చెబుతున్నారు.
పెళ్ళికి వచ్చే సన్నిహితుల్లో కరణ్ జోహార్, షామిద్ కూర్, మనీష్ మల్హోత్రాలు ఉన్నారు. సిద్- కియారాలు మొదటిసారిగా షేర్షా సినిమాలో కలిసి నటించారు. అప్పటి నుంచే వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని టాక్.