అమ్మాయి అలా అందంగా నడుచుకొస్తుంటే…ఏంటీ లేట్ అన్నట్టు అబ్బాయి వాచ్ చూస్తుంటే….నువ్వు చాలా బాగున్నావ్ అంటూ అమ్మాయి కూల్ చేస్తూ….ఓ మంచి పాటకు డాన్స్ చేస్తూ వచ్చి అబ్బాయి మెడలో దండ వేసింది. అమ్మాయి ప్రేమకు అబ్బాయీ తలవొంచాడు, తిరిగి దండ వేసాడు. తర్వాత ఒక ముద్దుతో ఒక్కటయ్యారు. అచ్చం సినిమాలా ఉంది కదా. సినిమా సెలబ్రిటీలు ఏం చేసినా అలానే ఉంటుంది కదా మరి. పైన చెప్పినదంతా సిద్ధార్ధ్-కియారాల పెళ్ళి వేడుక. దీని సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఇంత క్యూట్ గా ఉన్న వీడియో వైరల్ అయింది.
మూడు రోజుల క్రితం బాలీవుడ్ జంట సిద్ధార్ధ్ మల్హోత్రా, కియారా అద్వానీ పెళ్ళితో ఒక్కటయ్యారు. రాజస్థాన్ లోని జెసల్మైర్ పేలస్ లో బంధువుల, సన్నిహితుల సమక్షంలో వీళ్ళ పెళ్ళి ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన లేత గులాబీ రంగు లెహంగాలో కియారా, క్రీమ్ కలర్ షేర్వాణీలో సిద్ధార్ధ్ మెరిసిపోయారు. షేర్షా సినిమాలో వీళ్ళిద్దరు కలిసి చేశారు. అప్పటి నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట తమ రిలేషన్ షిప్ మీద ఎక్కడా నోరు విప్పలేదు.