కియారా అద్వాని-సిద్ధార్థ మల్హోత్రా జంట హనీమూన్ ట్రిప్‌ను తెగ ఎంజాయ్ చేసి తిరిగి ముంబాయి చేరుకుంది. ఇటీవల రాజస్థాన్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా వివాహమాడిన ఈ జంట వెంటనే హనీమూన్‌కు చెక్కేసింది. హనీమూన్‌ను పూర్తి చేసుకొని తిరిగి స్వదేశానికి వచ్చారు. ముంబాయి ఎయిర్ పోర్ట్‌లో ఒక్కసారిగా దర్శనమివ్వడంతో అభిమానులు సెల్ఫీల కోసం అభిమానులు ఎగబడ్డారు.
హనీమూన్ సమయంలో తన భర్తతో ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది కియారా. ఈ ఫోటోలు విపరీతంగా అభిమానులను ఆకర్షిస్తున్నాయి. ఫస్ట్ నైట్ రోజు ఫోటోలను కియారా అద్వానీ షేర్ చేయగా అవి తెగ వైరల్ అవతున్నాయి. “ఆ రాత్రి గురించి ఏం చెప్పాలి.. సమ్‌థింగ్ రియల్లీ స్పెషల్” అంటూ సిద్ధార్థ్‌తో ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ ఈ క్యాప్షన్ పెట్టింది.ఈ పోస్ట్ కు అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు జత చేస్తున్నారు. కొందరు బోల్డ్ కామంట్లు పెడుతుంటే మరికొందరు మాత్రం ఫన్నీ డైలాగులు పేల్చేస్తున్నారు.
తెలుగులో స్టార్ మహేష్ బాబు ‘భరత్ అను నేను’ సినిమాతో తెలుగు సినిమాల్లోకి కియారా అద్వానీ ఎంట్రీ ఇచ్చింది.. ఆ ఒక్క సినిమాతోనే తెలుగులో స్టార్ హీరోయిన్‌గా హోదా సంపాదించుకుంది. ఆ తర్వాత రామ్ చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’లో మెరిసింది. అయితే ఆ సినిమా అనుకున్న రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది. దీంతో తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు