కిచిడీని గౌరవిస్తూ, నిలబడి తినాలా? - MicTv.in - Telugu News
mictv telugu

కిచిడీని గౌరవిస్తూ, నిలబడి తినాలా?

November 2, 2017

కిచిడీని జాతీయ వంటకంగా కేంద్ర  ప్రభుత్వం  ప్రకటించనున్నట్లు వార్తలు రావడం తెలిసిందే. ఈమేరకు ఆహార శుద్ధి శాఖ చేసిన ప్రతిపాదనకు ఆమోదం పలికారని, ఢిల్లీలో జరిగే వరల్డ్ ఫుడ్ ఇండియా వేడుకల్లో దీనికి పట్టం కడతారని అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో భయంకరమైన సటైర్లు పేలుతున్నాయి. ఏదో పొద్దుపోక.. ఇలాంటి హోదాలు కట్టబెడుతున్నారని, ఇలాంటి పనులకు బదులు జనానికి ఇంత తిండి పెట్టే పనులు చేయాలని మండిపడుతున్నారు. నెటిజన్లు పేల్చిన జోకుల్లో కొన్ని..ఈ ప్రతిపాదన తెచ్చిన వాడిని జాతీయ మూర్ఖుడిగా ప్రకటించాలి

  • మన ఆర్థిక వ్యవస్థ ఘోరంగా ఉంది. చవకైన కిచిడీని జాతీయ వంటకంగా ప్రకటించడం సబబే.
  • కిచిడీ జాతీయం వంటకం కదా.. ఇక దాన్ని తినేటప్పుడు గౌరవిస్తూ లేచి నిలబడి తినాలా?
  • కిచిడీ జాతీయ వంటకమైతే రైతాను జాతీయ పానీయంగా ప్రకటించడి మహాప్రభో..
  • కిచిడీ ఫ్లేవర్ ఉన్న కండోములను జాతీయ గర్భనిరోధకంగా ప్రకటించాలి
  • జాతీయ అల్పాహారంగా కొబ్బరి ప్రసాదాన్ని ప్రకటించాలి
  • కిచిడీని జాతీయ శాకాహార వంటకంగా, బీఫ్ పులావును జాతీయ మాంసాహార వంటకంగా  ప్రకటించాలి