కిచిడీ.. మన జాతీయ వంటకం! - MicTv.in - Telugu News
mictv telugu

కిచిడీ.. మన జాతీయ వంటకం!

November 1, 2017

బియ్యం, కూరగాయలు, కాస్త మసాలా..అవీ కలిపి వండే కిచిడీకి రాజవైభవం దక్కనుంది. ఈ వంటకాన్ని మన దేశ జాతీయ వంటకంగా ప్రకటించేందుకు రంగం సిద్ధమైంది. నవంబర్ 4న ఢిల్లీలో జరగునున్న తొలి వరల్డ్ ఫుడ్ ఇండియా వేడుకల్లో దీనికి ఈ హోదా ఇవ్వనున్నారు.

దేశంలోని ప్రముఖ వంటగాళ్లందరూ ఈ వేడుకల్లో పాల్గొని తమ నలభీమపాకాలను ఆహూతులకు రుచిచూపన్నారు. కిచిడీకి జాతీయ వంటకం హోదా కల్పించేందుకు ఆహార శుద్ధి శాఖ తెచ్చిన ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపిందని సమాచారం. దేశంలోని ధనికులు, పేదలు అందరూ దీన్ని ఇష్టపడతారు కనుకు దీనికి పట్టం కట్టాలని సదరు మంత్రిత్వ శాఖ సెలవిచ్చిందట.