హైదరాబాద్లో కలకలం రేపిన శిశువు తల కేసు కొలిక్కి వస్తోంది. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఒక వ్యక్తి కొడుక్కి ఆరోగ్యం సరిగ్గా లేదని, అతనికి బాగుకావాలని ఎవరో బిడ్డను ఎత్తుకొచ్చి చంపేశారని అనుమానిస్తున్నారు.ఉప్పల్లోని చిలుకా నగర్లోని రాజశేఖర్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులు ఇంటి డాబాపై రెండు నెలల చిన్నారి తల కనిపించం తెలిసిందే. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చుట్టుప్రక్కలు ,డ్రైనేజీలు అన్నీ వెతికినా కూడా చిన్నారి మొండెం కనబడలేదు. తలను బట్టి చిన్నారు మూడు, నాలుగు నెలల పసికందు అని పోలీసులు అనుమానించారు. వెంటనే జాగిలాలను తీసుకస్తే…అవి పక్క ఇంట్లోకి వెళ్లడంతో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణం మొన్న చంద్రగ్రహణం రోజైన బుధవారం జరిగినట్టు తెలుస్తోంది. నిందితుల ఇంట్లో దేవుళ్ల పటాలు, పూజా సామాగ్రి భారీగా పోలీసులు గుర్తించారు. అరెస్ట్ చేసిన వారిలో తండ్రి తన కొడుకు ఆరోగ్యం బాగాలేక గ్రహణం రోజున చిన్నారిని బలియిచ్చి పూజలు చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈసంఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సింది. అరెస్ట్ చేసిన వారిని పోలీసులు విచారిస్తున్నారు.