బుడతడి దేశభక్తికి నెటిజన్లు ఫిదా.. వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

బుడతడి దేశభక్తికి నెటిజన్లు ఫిదా.. వీడియో

October 12, 2020

nbvgn

సరిహద్దులో గస్తీ కాస్తున్న సైనికుల పట్ల దేశప్రజలకు ఎవరికైనా ప్రత్యక గౌరవం ఉంటుంది. సైనికులు కనిపిస్తే కొందరు సెల్యూట్ చేస్తారు. సరిహద్దులో వీర మరణం పొందిన సైనికులతో ప్రత్యేక్ష బంధుత్వం లేనప్పటికీ వారి అంతిమ యాత్రలో పాల్గొంటారు. అయితే సైనికుల పట్ల గౌరవానికి వయస్సు సంబంధం లేదని తెలిపే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

అందులో నిండా పదేండ్లు కూడా లేని ఓ కుర్రవాడు ఇండో-టిబెట్ బార్డర్ సైనికులు(ఐటిబీపీ) వెళ్తుంటే వాళ్ళను చూసి సెల్యూట్ చేస్తాడు. ఈ సంఘటన లఢఖ్‌లోని చుశుల్‌లో జరిగింది. నంగ్యాల్ బాలుడు  ఆర్మీ సైనికుల మాదిరి కాలుతో నేతలను ఉద్వేగంతో సెల్యూట్ చేశాడు. దీనిని ఇండో-టిబెట్ బార్డర్ సైనికుడు ఒకరు వీడియో తీశారు. ఆ వీడియోను ఐటిబీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతొంది. ఆ బాలుడికి దేశ సైనికులపై ఉన్న గౌరవానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. భవిష్యత్తులో ఆ బుడతడు సైనికుడు అవుతాడని నెటిజన్లు అంటున్నారు.