శ్రీకాంత్‌కు 2 కోట్ల నజరానా - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీకాంత్‌కు 2 కోట్ల నజరానా

November 1, 2017

ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్‌ కైవసం చేసుకుని భారత దేశానికి అంతర్జాతీయంగా పేరుప్రతిష్టలు తెచ్చిపెడుతున్న ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కళ్లు తిరిగే నజరానాలు ప్రకటించింది. రూ.2 కోట్ల నగదు ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే వెయ్యి గజాల స్థలంతోపాటుట  డిప్యూటీ కలెక్టర్‌ కొలువు కూడా ఇవ్వాలని తీర్మానించింది. కోచ్‌ గోపిచంద్‌కు, మరో ఇద్దరికి రూ.30 లక్షలు అందచేయాలని ఏపీ కేబినెట్ బుధవారg నిర్ణయం తీసుకుంది. శ్రీకాంత్ ఏపీ సర్కారును నుంచి గతంలో రూ. 50 లక్షల నజరానా అందుకున్నారు. అస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీష్ బ్యాడ్మింటన్ టైటిల్ గెలిచినందుకు ఆ డబ్బు ఇచ్చింది ఏపీ. అయితే తాజా నజరానాపై విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి క్రీడాకారులకు మంచి మరింత మంచి శిక్షణ ఇవ్వాలి గాని, కోట్లు ఇవ్వడమేంటని అంటున్నారు. ఆ డబ్బును స్కూళ్లలో క్రీడా పరికరాల నిధులకు కేటాయించి, పిల్లలకు క్రీడల్లో పకడ్బందీ శిక్షణ ఇప్పించడానికి ఖర్చు చేస్తే వారు భవిష్యత్తులో దేశానికి వన్నె తెస్తారని చెబుతున్నారు.