ప్రపంచ నంబర్ వన్ మన తెలుగోడే.. - MicTv.in - Telugu News
mictv telugu

ప్రపంచ నంబర్ వన్ మన తెలుగోడే..

April 10, 2018

మ్యాచ్‌లలో శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే తెలుగు కుర్రోడు పాతికేళ్ల కిదాంబి శ్రీకాంత్‌ అత్యంత అరుదైన రికార్డు  సృష్టించాడు. బ్యాడ్మింటన్‌లో పురుషుల విభాగంలో ప్రపంచ నంబర్‌ వన్‌ ర్యాంక్‌ దక్కించుకోబోతున్నాడు. బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ గురువారం ర్యాంకుల జాబితా విడుదల చేయనుంది. శ్రీకాంత్‌కు మొదటి ర్యాంక్‌ దక్కనుంది.మొత్తం 76, 895 పాయింట్లతో శ్రీకాంత్‌ తొలిస్థానం అందుకోబోతున్నాడు. ప్రస్తుతం వరల్డ్‌ నంబర్ వన్‌ స్థానంలో ఉన్న విక్టర్‌ అక్సెల్సన్‌ ఖాతాలో ఇప్పుడు 77,130 పాయింట్లే ఉన్నాయి. గాయం వల్ల అతడు కొంత కాలంగా ఆడడం లేదు. దీంతో అతడు 1,660 పాయింట్లు కోల్పోతాడు. ఫలితంగా శ్రీకాంత్‌కు అగ్రతాంబూలం దక్కనుంది. వాస్తవానికి శ్రీకాంత్‌కు గత ఏడాదే ఈ ఘనత దక్కాల్సి ఉండగా, గాయం వల్ల సాధ్యం కాలేదు. గుంటూరు జన్మించిన శ్రీకాంత్ హైదరాబాద్‌లోని గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందాడు.