కిడారి, సివేరిలను చంపి పారిపోతున్న మావోలు... వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

కిడారి, సివేరిలను చంపి పారిపోతున్న మావోలు… వీడియో

September 25, 2018

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను దారుణంగా మావోస్టులు హత్యచేశారు. ఆపై ఘటనాస్థలం నుంచి పారిపోతున్న  వీడియో పోలీసులకు చిక్కింది. ఆ వీడియోలో ఉన్నది పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కామేశ్వరి అలియాస్ సింద్రి, తూర్పు గోదావరి జిల్లా జలుమూరు శ్రీనుబాబు అలియాస్ రైనోగా పోలీసులు గుర్తించారు.

కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోములను హత్య చేసిన ఆనంతరం పారిపోతుండగా, గుర్తు తెలియని ఓ వ్యక్తి సెల్ ఫోన్లో వీడియోను తీశాడు. అరకు ప్రాంతంలో మావోలు పెద్దఎత్తున సంచారిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు పెద్దఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. . మరోవైపు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల పోలీసులు కూడా కూంబింగ్‌లో పాలుపంచుకుంటూ ఉండటంతో మన్యం యుద్ధక్షేత్రంగా మారింది.