17 ఏళ్ల క్రితం కిడ్నాప్.. ఇవాళ ఢిల్లీలో ప్రత్యక్షం
2006లో కిడ్నాప్ అయిన యువతి తాజాగా ఢిల్లీలో ప్రత్యక్షమైంది. 17ఏళ్ల తర్వాత ఆమె కన్పించడంతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మే 22న సీమాపురి పోలీస్ స్టేషన్కు అందిన రహస్య సమాచారంతో 17ఏళ్ల క్రితం కిడ్నాప్ అయిన 32ఏళ్ల మహిళను గుర్తించామని డీసీపీ రోహిత్ మీనా స్పష్టం చేశారు. 2006లో సదరు మహిళ కిడ్నాప్‌కు గురైంది. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఢిల్లీలోని గోకుల్‌పురి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తాజాగా సదరు యువతిని గుర్తించిన పోలీసులు.. ఆమె వయసు 32 ఏళ్లని తెలిపారు.
‘‘మే 22వ తేదీన సీమపురి పోలీస్ స్టేషన్ టీమ్ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టింది. రహస్యంగా సమాచారం సేకరించింది. 17 ఏళ్ల క్రితం కిడ్నాప్‌కి గురైన మహిళను గుర్తించాం. ప్రస్తుతం ఆమె వయసు 32 ఏళ్లు. 2006లోనే ఈ కిడ్నాప్ ఘటనపై కేసు నమోదైంది. అప్పుడు ఆ యువతి తల్లిదండ్రులు వచ్చి ఫిర్యాదు చేశారు" అని డీసీపీ తెలిపారు.
మహిళని పీఎస్‌కు తీసుకొచ్చి విచారణ జరపగా.. కిడ్నాప్ తర్వాత జరిగిన పరిస్థితుల్ని పోలీసులకు వివరించింది. ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లా చెర్దీ గ్రామంలో దీపక్ అనే వ్యక్తితో నివసించినట్లు తెలిపింది. లాక్‌డౌన్ సమయంలో తలెత్తిన వివాదాల కారణంగా ఇద్దరూ విడిపోయినట్లు చెప్పింది. అనంతరం గోకుల్‌పురి ప్రాంతంలో ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నట్లు వివరించింది.