ఫోను లేందే  అన్నం తింటలేరు,పండుకుంటలేరు..! - MicTv.in - Telugu News
mictv telugu

ఫోను లేందే  అన్నం తింటలేరు,పండుకుంటలేరు..!

August 12, 2017

ఐదారేండ్ల కింద వయసు పోరగాన్లకు గుడ ఫోన్లెట్లుంటయో,అన్ల ఆప్షన్లు ఎట్లుంటయో తెల్వది,ఆరోజులల్ల బండపీసు(ఫోన్)ను  జూసుడే గొప్ప,కనీ ఇప్పుడట్లుందా పరిస్ధితి.ముడ్డికింద మూడేళ్లు గుడ లేని పోరగాన్లనుంచి,కాటికి కాళ్లు సాపుకన్న  ముసలోళ్ల దాక అంత అన్లనే మూతివెట్టుడేనాయే,ముసలోల్ల కథ  ఎట్లైన ఒడ్శిపోయింది గనీ..శిన్న పోరగాన్లతోనే అచ్చింది అసలు గోస,ఈ స్మార్ట్ ఫోన్లు సల్లగుండా…అవ్వి ఏమంటె వచ్చినయో…పోరగాళ్లు పోనులేందే అన్నం తింటలేరు,ఫోన్ల గేములాడందే  అర్ధరాత్రిదాక పండుకుంటలేరు.

తల్లిదండ్రులు గుడ  ఓ కారణం…!

పోరగాళ్లు  ఫోన్లకు బగ్గ అలవాటు కానీకి.. తల్లి దండ్రులు గుడ ముఖ్య కారణమవుతున్రు,ఎట్లంటే…పిల్లలు  అన్నం తినకపోతే… అప్పట్ల చందమామ సూపెట్టుకుంట..ఇంకా ఆగో ఆగో గటు సుడు ,గిటు,సుడు  అని ప్రకృతిని సూపెట్టుకుంట ముద్దలు నోట్లె వెడ్తుదురు…ఇప్పుడేమో బన్నీ,చిన్నీ  నువ్వన్నం తిన్నవనుకో  ఫోనిస్తా,ట్యాబ్ ఇస్తా అని ఆశ వెడ్తరు.హోవంర్క్ జెయ్యనీకనీ,శెప్పినట్టు ఇననీకి అని ఇట్ల ప్రతి దానికి పిల్లలకు ఫోన్ తోనే ఆశవెడ్తరు.ఏదో అప్పటి పూర్తి కథ ఒడ్శింది అని అన్కుంటరు గనీ,తర్వాత తర్వాత  పిల్లలు మొత్తం ఫోన్ కే అడిక్ట్ అయిపోతరన్న ముచ్చట మర్శిపోతున్నరు.

చాట అంత ఉండే ట్యాబులు,స్మార్టు ఫోన్లు  అచ్చినంక పోరగాన్లు అన్లనే మూతి వెట్టి రకరకాల గేములు ఆడుకుంట  ఎక్కో టైంపాస్ జేస్తరు.ఇగ పిల్లలకు ఫిజికల్ గా శ్రమ ఏడుంటది. అందుకే  పిల్లలు ఫోన్లకు అల్వాటు గాకుంట తల్లిదండ్రులే జాగ్రత్త తీస్కోవాలే…మీరు  ఫోన్లను ఎంత తక్కోవాడితే మీ పిల్లలుగుడ అదే ఫాలో ఐతరు,అంతేగనీ మీరే ఫేసుబుక్కులనీ,వాట్సప్ లనీ  24 గంటలు అన్లనే మూతివెడ్తె ఇగ మీ పిల్లలు వెట్టరా ,చెట్టొకటైతె..విత్తనం ఇంకోటైతదా… అందుకే పిల్లలకు ఫోన్లను దూరంగ ఉంచి వాళ్లకు శారీరక శ్రమ కలిగే ఆటలమీద వాళ్ల దృష్టిని మరలించండి.అప్పుడు మీపిల్లలు ఏమన్న దారిల వడ్తరు,లేకపోతే  మూడు గేములు,ఆరు ఆటలు పోన్లనే ఆడుకుంట  పొద్దెల్లదీస్తరు ఆ తర్వాత మీఇష్టం.