Kids faces python to save pet dog
mictv telugu

కొండచిలువతో బుడ్డోళ్ల ఫైట్.. కుక్క సేఫ్..

August 8, 2022

Kids faces python to save pet dog

కుక్కపిల్లలంటే చిన్నపిల్లలకు చాలా ప్రేమ. వాటికి బిస్కెట్లు వేసి సంబరపడతారు. ఇళ్లకు ఎత్తుకొస్తున్నారు. చైనాలోని ఆ ముగ్గురు బుడ్డోళ్లకు కూడా కుక్కలంటే ప్రేమ. ఓ వీధికుక్కను చేరదీసి జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఓ కొండచిలువ ఆ కుక్కపై కన్నేసి సమయం చూసి చుట్టేసి మింగబోయింది.

అది కాస్తా పిల్లల కంటబడింది. అంతే, ముగ్గురూ బాహుబలి అవతారం ఎత్తేసి ఆ పాముతో తలపడ్డారు. ముగ్గురి పెద్దోడు కర్రతో పాము కొట్టి దాని పీక గట్టిగా పుచ్చుకున్నాడు. మిగతా ఇద్దరు కుక్క నడుము చుట్టుకున్న కొండచిలువలను ఒంట్లోని శక్తినంతా కూడదీసుకుని లాగారు. పాము ఒక పట్టాన పట్టువిడువలేదు. పిల్లలు పట్టుపట్టి దాన్ని గుంజారు. దీంతో కుక్క బతుకు జీవుడా అంటూ తోక విదిలించుకుని పారిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పిల్లల పట్టుదలకు, కుక్కపై వాళ్ల ప్రేమకు జనం ఫిదా అవుతున్నారు.