విద్యార్థులు టిఫిన్ చేయడం లేదా..అయితే మార్కులు తగ్గుతాయ్..! - MicTv.in - Telugu News
mictv telugu

విద్యార్థులు టిఫిన్ చేయడం లేదా..అయితే మార్కులు తగ్గుతాయ్..!

November 21, 2019

Kids .

ఎదిగే వయస్సులో చాలా మంది విద్యార్థులు టిఫిన్ చేయడానికి తెగ మారాం చేస్తారు. ఉదయం లేవగానే తినడం ఇష్టపడక ఖాళీ కడుతోనే ఆదరా బాదరాగా స్కూలుకు వెళ్తుంటారు. అయితే ఇది చదువుపై తీవ్ర ప్రభావం చూపుతుందని బ్రిటన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎవరైతే ఉదయం లేవగానే ఆహారం సరిగా తీసుకోకుండా ఉంటారో వారికి పరీక్షల్లో మార్కులు తగ్గిపోతాయని వెల్లడించారు. పలు పరిశోధనల తర్వాత ఇది బయటపడినట్టుగా చెబుతున్నారు. 

బ్రిటన్‌కు చెందిన లీడ్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు విద్యార్థులపై పరిశోధనలు చేశారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో పొద్దున్నే టిఫిన్ తినే వారిని, తినకుండా వచ్చిన వారిని పరీక్షించారు. దీంట్లో టిఫిన్ తినని వారు చదువులో వెనకబడిపోయినట్టుగా తేల్చారు.శరీరంలో పోషకాలు తగ్గిపోవడం వల్ల దాని ప్రభావం మెదడుపై పడి ఏకాగ్రత కోల్పోతున్నట్టు కేటీ అడోల్ఫస్‌ తెలిపారు. ఆడ, మగ తేడా లేకుండా టిఫిన్ చేయని వారికి మార్కులు తక్కువగా వస్తున్నట్టు వెల్లడించారు.