kieron pollard announces ipl retirement
mictv telugu

ముంబై ఇండియన్స్‌ను వీడిన బిగ్ హిట్టర్

November 15, 2022

ఐపీఎల్‌కు మరో స్టార్ క్రికెట్‌ర్ గుడ్ బై చెప్పేశాడు. ముంబై ఇండియన్స్ కీలక ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించాడు. అయితే ముంబై ఇండియన్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా ఉండడంతో పాటు ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్‌లో ఆడనున్నట్లు తెలిపాడు. సుమారు పదేళ్లుగా ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ముంబై 5 ఐపీఎల్ ట్రోఫీలు మరియు 2 ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీలు గెలవడంతో తన వంతు కృషి చేశాడు. తన ఐపీఎల్ కెరీర్‌లో ముంబై ఇండియన్స్‌కు తప్ప కీరన్ పొలార్డ్ మరి ఏ ఇతర జట్టుకు ఆడలేదు. ఐపీఎల్‌‌లో మొత్తంగా 171 ఇన్నింగ్స్‌ లు ఆడి 3,412 పరుగులు చేశాడు. అందులో 16 హాఫ్‌ సెంచరీలున్నాయి. బౌలింగ్‌ లో 69 వికెట్లు తీసిన పొలార్డ్‌ 103 క్యాచ్‌లను అందుకున్నాడు.

’’గత 13 సీజన్లలో ఐపీఎల్ టోర్నీలో అతిపెద్ద మరియు అత్యంత విజయవంతమైన జట్టుకు ప్రాతినిధ్యం వహించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అదే సమయంలో గౌరవంగా భావిస్తున్నాను. ఈ అద్భుతమైన జట్టు కోసం ఆడాలనేది ఎల్లప్పుడూ కోరుకుంటూనే ఉంటా. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లతో ఆడినందుకు నేను అదృష్టవంతుడిని. ఫీల్డ్‌లో మరియు వెలుపల అభిమానుల మద్దతును నేను ఎల్లప్పుడూ మర్చిపోను. ముంబై గెలిచిన ట్రోఫీలలో సభ్యుడిగా ఉన్నందుకు సంతోష పడుతున్నా” అంటూ పొలార్డ్ తెలిపాడు.

విధ్వంసకర ఆటతీరుకు పెట్టింది పేరు కీరన్‌ పొలార్డ్‌. 10వేలకు పైగా పరుగులు.. 300కు పైగా వికెట్లు తీసి టి20 క్రికెట్‌ చరిత్రలోనే అత్యున్నత ఆల్ఆ‌రౌండర్‌గా పేరు పొందాడు. గత ఐపీఎల్‌లో మాత్రం పొలార్డ్ ఘారంగా విఫలమయ్యాడు.