దారుణం… నడిరోడ్డుపై కానిస్టేబుల్‌ను నరికి చంపారు.. - MicTv.in - Telugu News
mictv telugu

దారుణం… నడిరోడ్డుపై కానిస్టేబుల్‌ను నరికి చంపారు..

October 13, 2018

ఈరోజుల్లో పోలీసులు నిజాయితీగా డ్యూటీ చేసుకోవడం కూడా నేరమే అవుతున్నట్టుంది. విశాఖపట్నం జిల్లాలో అలాంటిదే ఓ ఘటన జరిగింది. నక్కపల్లి మండలం, వేంపాడు టోల్ గేట్ వద్ద ఆగి ఉన్నాడు కానిస్టేబుల్. ఇంతలో ఓ కారులో వచ్చిన 8 మంది దుండగులు అతనిమీద దాడి చేశారు. అత్యంత కిరాతకంగా నరికి చంపి అదే వాహనంలో పరారయ్యారు. వివరాల్లోకి వెళ్తే…killed the constable on the roadside vizagమృతుడు తమిళనాడుకు చెందిన నీలమగ అమరన్‌గా గుర్తించారు. అతను మధురైలో పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నట్టు పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. ఈ హత్యకు పాల్పడిన దుండగులు గంజాయి వ్యాపారస్తులే అని అనుమానిస్తున్నారు. ఆరుగురు నిందితులు పట్టుబడగా, మరో ఇద్దరు పరారయ్యారు. వారి నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.  పరారీలో ఉన్న మరో ఇద్దరి నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.  గంజాయి వ్యాపారంపై కానిస్టేబుల్ ఉక్కుపాదం మోపినందుకు చంపారా ? లేకపోతే మరేమైనా కారణాలున్నాయా అనే కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు.