సీరియల్ కిల్లర్ ఛార్లెస్ శోభరాజ్ ను విడుదల చేయాలని నేపాల్ కోర్టు ఆదేశించింది. ఆరోగ్య కారణాల రిత్యా అతడిని విడుదల చేస్తున్నామని ప్రకటించింది. శోభరాజ్ వయసు 78 ఏళ్ళు. అతని మీద పెండింగ్ కేసులు ఏమీ లేకపోతే వెంటనే విడుదల చేయాలని, అయిన 15 రోజుల లోపు స్వదేశం పంపించేయాలని కోర్టు సూచించింది. ఉత్తర అమెరికాకు చెందిన ఇద్దరు టూరిస్టులను చంపిన కేసులో 2003లో శోభరాజ్ ను నేపాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిలో అతనికి 21 ఏళ్ళు జైలు శిక్ష పడింది. ఇప్పటికే 20 ఏళ్ళఉ ముగియడం, ఛార్లెస్ కూడా బాగా ముసలివాడు అయిపోవడంతో కోర్టు అతనిని విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు కూడా ఇతను ఢిల్లీలో ఓ ఫ్రెంచ్ పౌరుడిని చంపిన కేసులో 1976 నుంచి 1997 వరకు జైల్లోనే ఉన్నాడు.
ఇండియన్, వియత్నాం దంపతులకు ఛార్లెస్ పుట్టాడు. తల్లిదండ్రుల నిర్లక్ష్యం, వేరే వాళ్ళు దత్తత తీసుకోవడం, వాళ్ళు కూడా ఇతనిని సరిగ్గా చూసుకోకపోవడం లాంటి కారణాలతో నేరస్తుడిగా మారాడు. 1970లలో వరుస హత్యలు, దోపిడీలు చేయడంతో ఇతని పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. ఛార్లెస్ మీద 20 హత్య కేసులు నమోదయ్యాయి. అందుకే 1976 నుంచి వరుసగా జైలు శఇక్ష అనుభవిస్తూనే ఉన్నాడు.