ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్..ఈ మధ్యకాలంలో తరుచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ప్రపంచం ఒకవైపు అయితే తానొక వైపు అంటూ కంటిమీద కనుకులేకుండా చేస్తుంటాడు. బాలిస్టిక్ సముద్రంలో అణ్వాయుధాలను ప్రయోగిస్తూ అమెరికాకు ముచ్చెమటలు పట్టించాడు. అయితే కొంతకాలంగా కిమ్ ఆరోగ్యం గురించి తరుచుగా వార్తలు కూడా వినిపించాయి. తాజాగా అలాంటి వార్తే ఇప్పుడు వైరల్ గా మారింది. కిమ్ వయస్సు సంబంధిత సమస్యలతో తీవ్ర ఆందోళణకు గురువుతున్నారంటూ ఓ కథనం వెల్లడించింది. ఎక్కువగా వైన్, ఆల్కాహాల్ తాగుతూ..అనారోగ్యం బారిన పడ్డాడని పేర్కొంది.
కాగా కిమ్ త్వరలోనే 40లోకి అడుగపెట్టనున్నారు. 40వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఆయన తన ఆరోగ్యం గురించి తీవ్రంగా బాధపడుతున్నారని తెలుస్తోంది. విపరీతంగా ఆల్కహాల్ తాగుతూ…కిమ్ ఏడుస్తున్నారట. ఒంటరితనాన్ని, ఒత్తిడిని అనుభవిస్తున్నారని సియోల్ కేంద్రంగా ఉత్తరకొరియా వ్యవహారాలను పరిశీలిస్తున్న డాక్టర్ చోయ్ జిన్ వుక్ వెల్లడించారు. కిమ్ మధ్యవయస్సు సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారని..తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారని ఓ అంతర్జాతీయ మీడియా కూడా తెలిపింది. అయితే వ్యాయామం చేయాలని భార్య, వైద్యులు చెప్పిన కూడా కిమ్ ఏమాత్రం పట్టించుకోవడం లేదట.
కిమ్ ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలు కొత్తేం కాదు. ఎందుకంటే గతంలో కిమ్ కోవిడ్ బారిన పడ్డారని చావు అంచుల్లోకి వెళ్లారని..ఒక సమయంలో కిమ్ మరణించారంటూ అనేక వార్తలు వచ్చాయి. కిమ్ బరువు తగ్గారని, తలకు మిసర్టీ మరకలు ఉన్నాయని, సర్జరీ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారని కోమాలోకి వెళ్లారంటూ కూడా పలు మీడియా సంస్థలు రాసాయి. అయితే కిమ్ ఆరోగ్యం గురించి ఎప్పుడూ గోప్యంగానే ఉంటుంది. అప్పుడప్పుడు తన భార్యతో కనిపించే కిమ్..ఈ మధ్య తన కుమార్తెను బాహ్య ప్రపంచానికి పరిచయం చేశారు. కుమార్తెకు వారసురాలిగా బాధ్యతలు అప్పగిస్తున్నారన్న వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి.