పొరపాటున చంపాం.. కిమ్ క్షమాపణ  - MicTv.in - Telugu News
mictv telugu

పొరపాటున చంపాం.. కిమ్ క్షమాపణ 

September 25, 2020

ఇటీవల దక్షిణ కొరియాకు చెందిన ఓ అధికారి తనిఖీలకు వెళ్లగా అతన్ని ఉత్తరకొరియా సైనికులు కాల్చి చంపారు. ఈ ఘటనపై ఉత్తరకొరియా నియంత కిమ్‌జోంగ్‌ ఉన్‌ స్పందిస్తూ విచారం వ్యక్తంచేశారు. తమ సైనికులు చేసిన పనికి పశ్చాత్తాపపడుతున్నామని పేర్కొంటూ లేఖ పంపారు. ఈ వారం మొదట్లో దక్షిణ కొరియాలోని ఫిషరీస్‌ విభాగంలో పనిచేసే ఓ అధికారి ఉత్తరకొరియా సరిహద్దుల్లో తనిఖీకి వెళ్లి ఉత్తరకొరియా జల్లాల్లోకి ప్రవేశించాడు. దీంతో ఆ దేశ సైనికులు సదరు అధికారిని కాల్చి చంపారు. 

ఈ ఘటనను దక్షిణ కొరియా రక్షణమంత్రి ఖండించారు. దీనికి ఉత్తర కొరియా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో అప్రమత్తత ప్రకటించారు. ఉత్తరకొరియా సైనికుల కదలికలపై నిఘాను మరింత పెంచారు. ఈ ఘటనపై ఎట్టకేలకు ఉత్తరకొరియా నియంత కిమ్‌ స్పందించారు. శుక్రవారం ఒక లేఖను దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌కు పంపించారు. ఈ ఘటన జరిగి ఉండాల్సిందికాదని.. పొరపాటున చంపామని ఆయన లేఖలో పేర్కొన్నారు.