కరోనా మమ్మల్ని ఏం చేయలేకపోయింది : కిమ్ జాంగ్ - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా మమ్మల్ని ఏం చేయలేకపోయింది : కిమ్ జాంగ్

July 3, 2020

ప్రపంచ వ్యాప్తంగా కరోనా అల్లకల్లోలం సృష్టిస్తుంటే.. ఒక్క ఉత్తర కొరియాలో మాత్రం అలాంటి ప్రభావం ఏమి కనిపించడం లేదు. అక్కడ వైరస్ వ్యాధి ఎవరికీ సోకలేదని చాలా కాలంగా ప్రకటిస్తూ వచ్చింది. తాజాగా దీనిపై ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ స్పందిచారు. కరోనా తమ దేశాన్ని ఏమి చేయలేకపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ దేశ అధికారిక న్యూస్ ఏజెన్సీ కేసీఆఎస్ఏ వెల్లడించింది. ఈ సందర్భంగా నార్త్ కొరియా ప్రజలపై ఆయన ప్రశంసలు కురిపించినట్టుగా పేర్కొంది.

కరోనా మహమ్మారి విషయంలో తమ ప్రజల పోరాటం అద్వితీయమని కిమ్ జాంగ్ ఉన్ వ్యాఖ్యానించారని తెలిపింది. వర్కర్స్ పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో ఈ విధంగా స్పందించారు. ప్రపంచ దేశాలను అల్లాడిస్తున్న వేళ, తన దేశాన్ని మాత్రం ఏమీ చేయలేకపోయిందని ఆయన అన్నారు. దూర దృష్టితో ముందుగా సరిహద్దులను మూసివేయడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. జాతి భద్రత కోసమే వేలాది మందిని ముందు జాగ్రత్తగా ఐసోలేషన్‌లో ఉంచానమన్నారు. జాతి యావత్తు స్వచ్ఛందంగా మహమ్మారిపై పోరాడిందని దేశ ప్రజలను అభినందించారని కేసీఎన్ఏ వెల్లడించింది.