అయ్యెయ్యో కర్దాసియన్.. మరీ ఇంత టైట్‌గానా.. - MicTv.in - Telugu News
mictv telugu

అయ్యెయ్యో కర్దాసియన్.. మరీ ఇంత టైట్‌గానా..

September 28, 2022

 

హాలీవుడు అమ్మడు కిమ్ కర్దాసియన్ ఏం చేసినా వింతే. ‘మరింత యవ్వనంగా కనిపించడానికి అవసరమైతే పెంట కూడా తినడానికి నేను రెడీ,’ అన్ని ఈ 41 ఏళ్ల ప్రౌఢ తాజాగా మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. చాలా అతిచేష్టకు పోయి ఎప్పట్లాగే నవ్వులపాలవుతోంది. ఫ్యాషన్ దుస్తుల్లో అప్డేట్‌గా ఉంటే కర్దాసియన్ ఎరక్కపోయి ఓ గౌనులో టైట్‌గా ఇరుక్కుపోయింది. అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టమై కప్పలా, గొర్రెపిల్లలా గెంతింది. మెట్లు ఎక్కడానికి మరింత ఇబ్బందిపడిపోయి అసిస్టెంట్ల సాయం తీసుకుంది. కారులోకి ఎక్కినప్పుడూ అంతే. మత్స్యకన్యలా కాళ్లనేవే లేకుండా జారగిలబడి కూర్చుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది.

కర్దాసియన్ ఇటీవల జరిగిన మిలాన్ ఫ్యాషన్‌ షో కోసం ఈ గుడ్డలు వేసుకొచ్చింది. డిజైనర్ తప్పో, లేక ఆమె తప్పో తెలీదుగాని డ్రెస్ శరీరానికి మరీ బిగుసుకుపోయింది. అందంగానే ఉన్నా కాలుతీసి కాలు పెట్టడానికి కూడా వీలుకాకపోవడంతో ఆమెతోపాటు చుట్టుపక్కల వాళ్లకూ నవ్వొచ్చేసింది. నడవడానికే కష్టమైతే ఫ్యాషన్ షోలో ఏం చేస్తుందని జనం ఘాటు కామెంట్లు పెడుతున్నారు. పాపం టాయిలెట్ వస్తే ఆమె పరిస్థితి ఏమిటని మరికొందరు జాలిపడుతున్నారు.