రైల్లో కింగ్ కోబ్రా.. ఇంకాసేపు ఉండుంటే..   - MicTv.in - Telugu News
mictv telugu

రైల్లో కింగ్ కోబ్రా.. ఇంకాసేపు ఉండుంటే..  

November 25, 2019

King Cobra measuring 10-feet rescued from super-fast train in Uttarakhand

రైలు ఎక్కడ ఆగితే ఎక్కిందో గానీ ఓ తాచు పాము రైలు బోగీ దిగువ భాగంలో చుట్టుకుని ఉంది. 10 అడుగుల పొడవు ఉన్న ఆ పామును కింగ్ కోబ్రా అంటారు. ఉత్తరాఖండ్ కాత్గొదమ్ రైల్వేస్టేషన్‌లో రైలు ఆగిన  సమయంలో రైల్వే సిబ్బంది దానిని గమనించారు. వెంటనే అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి దానిని సురక్షితంగా బయటకు తీసి అడవిలో విడిచిపెట్టారు.

 

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఉత్తరాఖండ్ అటవీశాఖకు చెందిన డాక్టర్ పీఎం దాకేటే ఈ వీడియోను ట్వీట్ చేశారు. పామును గుర్తించే సమయంలో సరిగ్గా రైలు బోగీ ద్వారం వద్ద కింది భాగంలో ఉంది. దానిని ఎవరూ గుర్తించకుండా ఉండుంటే అది బోగీలోకి దూరేదని, ప్రమాదం జరిగేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తానికి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించకుండా కోబ్రాను తొలగించినట్లు అటవీశాఖ సిబ్బంది వెల్లడించారు.