బైడెన్‌కు సౌదీ రాజు వార్నింగ్.. వేలు పెడితే.. - MicTv.in - Telugu News
mictv telugu

బైడెన్‌కు సౌదీ రాజు వార్నింగ్.. వేలు పెడితే..

March 4, 2022

uno

సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అమెరికాకు హెచ్చరికలు జారీ చేశారు. తమ అంతరంగిక వ్యవహారాల్లో బైడెన్ జోక్యం ఏంటని ప్రశ్నించారు. శుక్రవారం ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్‌ మాట్లాడుతూ.. ‘మాది రాజరిక దేశం. అమెరికా ప్రజాస్వామ్య దేశం. జో బైడెన్ తన దేశ విషయాలపై దృష్టి సారించాలి. మా ఆంతరంగిక వ్యవహారాల్లో బైడెన్ సలహాలు మాకక్కరలేదు. నా వ్యాఖ్యలను ఆయన ఎలా తీసుకున్నా నేను పట్టించుకోను. వాళ్ల దేశం గురించి మేం మాట్లాడం. మా దేశం గురించి వాళ్లు మాట్లాడవద్దు. అలాగే, వారితో ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామ’ని వివరించారు. కాగా, బైడెన్‌ వచ్చాక రెండు దేశాల మధ్య దూరం పెరిగింది. మరోవైపు రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో నిర్వహించిన ఓటింగ్ ప్రక్రియకు భారత్‌తో పాటు సౌదీ అరేబియా గైర్హాజరయింది. దీంతో బైడెన్ ప్రభుత్వం సౌదీ అరేబియాను ఓటింగ్‌లో పాల్గొనేలా చేయాలని ప్రయత్నించి విఫలమైంది. ఈ నేపథ్యంలో సౌదీ రాజు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.