జబర్దస్త్ కామెడీ ప్రోగ్రాం మాజీ ఆర్టిస్ట్ కిర్రాక్ ఆర్పీ హైదరాబాద్ నగరంలో కర్రీ పాయింట్ పెట్టిన విషయం తెలిసిందే. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో పెట్టిన ఈ కర్రీ పాయింట్ ప్రారంభించిన నెల రోజులకే మూతబడింది. నెల్లూరు స్పెషల్ వెరైటీలను అందించడమే ప్రత్యేకతగా చెప్పుకున్న ఈ కర్రీ పాయింట్ కస్టమర్ల విపరీత ఆదరణకు నోచుకుంది. దుకాణానికి వచ్చే జనాలతో ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు మొదలయ్యాయి. అలాగే వందల సంఖ్యలో ప్రజలు షాపుకు రావడంతో సమయానికి అందరికీ కర్రీ పార్సిల్ చేయడం కష్టమైపోయింది. లాభాలు భారీగా వస్తున్నప్పటికీ అందరికీ అందించలేకపోతున్నాననే బాధతో మూసేశారు. దీనిపై ఆర్పీ మాట్లాడుతూ భవిష్యత్ ప్రణాళిక వెల్లడించాడు. ‘షాపుకు జనాల తాకిడి ఎక్కువైంది. నెల్లూరు పెద్దారెడ్డి పేరు పెట్టడంతో బాగా కలిసొచ్చింది. కేవలం గిరాకీ ఎక్కువవడం వల్ల మూసేశాను. ఈ సారి కిచెన్ కెపాసిటీని భారీగా పెంచి తర్వాత దుకాణం ప్రారంభిస్తాను. షాప్ మూసేసిన విషయం తెలియక చాలా మంది వస్తున్నారు. వారికి ఇబ్బంది కలిగించినందుకు క్షమాపణలు చెప్తున్నా. డిమాండ్ కి తగ్గట్టు సర్వీస్ ఇవ్వడంలో భాగంగా నెల్లూరు నుంచి పులుసు వండే మహిళలను నగరానికి తీసుకొస్తా. అందుకోసం అక్కడే ఆడిషన్స్ పెట్టి సెలెక్ట్ చేస్తాము. త్వరలోనే భారీ స్థాయిలో షాపును తిరిగి ప్రారంభిస్తా’నని వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి :
యూట్యూబ్ వీడియోస్తో రూ.40 లక్షల అప్పు తీర్చేశాడు
గూగుల్ లో వీటిని సెర్చ్ చేస్తే జైలు జీవితం ఖాయం
ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్ కు మరోసారి చుక్కెదురు