Kiran Abbavaram Birthday Special, Team Rules Ranjan Poster Released
mictv telugu

ఏ బ్యాక్‌గ్రౌండ్ లేని కుర్ర హీరో.. ఏమాత్రం తగ్గడం లేదు

July 15, 2022

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వ‌రుస సినిమాల‌తో దూసుకెళ్తున్నాడు. రాజావారు రాణిగారు అనే చిన్న సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కిరణ్.. ఆ తర్వాత SR క‌ళ్యాణ మండ‌పం సినిమాతోను మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత వ‌చ్చిన ‘సెబాస్టియ‌న్’ కాస్త నిరాశ‌ప‌రిచింది. ఇటీవ‌ల వ‌చ్చిన ‘స‌మ్మ‌త‌మే’ కూడా ఫర్వాలేదనిపించింది. అయితే ఈసారి మంచి హిట్ కొట్టి మరోసారి తన సత్తా చాటాలనుకుంటున్నాడు కిరణ్. అందుకు తగ్గట్టే.. కిరణ్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మొత్తంగా అర‌డ‌జ‌నుకు పైగానే సినిమాలున్నాయి.. అవి కూడా టాలీవుడ్ బడా బ్యానర్స్‌లో తెరకెక్కుతున్నాయి. దాంతో రాబోయే రోజులు కిరణ్ అబ్బవరంకు కలిసొచ్చేలానే ఉన్నాయి. ఇటీవలె ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ అనే సినిమా టీజర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది. శ్రీధర్ గాదే దర్శకత్వంలో.. కోడీ దివ్య ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై.. కోడి రామక్రిష్ణ కూతురు కోడి దివ్య దీప్తి ఈ సినిమాను నిర్మిస్తోంది.

ఇక తాజాగా కిర‌ణ్ అబ్బ‌వ‌రం బ‌ర్త్‌డే సందర్భంగా కొత్త సినిమాల అప్టేట్స్ ఇచ్చారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చ‌ర్స్ పతాకంపై.. బన్నీ వాసు నిర్మాణంలో.. కిరణ్ హీరోగా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అనే సినిమా తెరకెక్కుతోంది. మురళీ కిశోర్ అబ్బురు ఈ సినిమాతో తెలుగు ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. దీంతో పాటు ‘రూల్స్ రంజన్’ అనే మరో కొత్త సినిమాలో కూడా కిరణ్ నటిస్తున్నాడు. ఈరోజు కిరణ్ బర్త్‌డే సందర్భంగా ‘రూల్స్ రంజన్’ టీమ్ తమ హీరోకి బర్త్ డే విషెస్ తెలుపుతూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఎ. ఎం. రత్నం సమర్పణలో నిర్మితమౌతున్న ఈ చిత్రంలో ‘డి. జె. టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ను ఎ. ఎం. రత్నం తనయుడు రత్నం కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దివ్యాంగ్ లవానియా, వి. మురళీకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.