Kiran Abbavaram new movie teaser released
mictv telugu

అమ్మాయిల విలువ కరువులో ఉండే మాలాంటోళ్లకే తెలుస్తుంది

July 10, 2022

సినీ పరిశ్రమలో సైలెంటుగా వచ్చి తనకంటూ పేరు తెచ్చుకున్న హీరో కిరణ్ అబ్బవరం ఇటీవల సమ్మతం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా రిలీజైన కొద్ది రోజుల్లోనే మరో సినిమాకు రెడీ అయిపోయాడు. ఆయన నటించిన చిత్రం నేను మీకు బాగా కావాల్సిన వాడిని టీజరును మేకర్స్ ఆదివారం రిలీజ్ చేశారు. డ్యాన్స్ మాస్టర్ బాబా ఇందులో కీలక పాత్ర పోషించారు. సంజనా ఆనంద్ హీరోయిన్ అయిన ఈ చిత్రాన్ని కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇక టీజర్ విషయానికి వస్తే హీరో డ్రైవరుగా కనిపిస్తాడు. కిరణ్ అబ్బవరంలోని మాస్ యాంగిల్ ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఆయన చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ‘యావరేజ్ అమ్మాయిలు అని తక్కువ చేసి మాట్లాడకు. అలాంటి అమ్మాయిల విలువ కరువులో ఉన్న నాలాంటోళ్లకు తెలుస్తుంది. నీలాంటి కడుపు నిండినోళ్లకి కాదు’ అనే డైలాగ్ బాగా పేలింది. అలాగే ఈ చిత్రానికి కిరణ్ అబ్బవరం మాటలు, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. కాగా, సెప్టెంబర్ 9న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు.