Kiran abbavaram new movie 'Vinaro Bhagyamu Vishnu Katha' Official teaser released
mictv telugu

‘ఈ రోజుల్లో లవ్ లేకుండా ఏ స్టోరీ ఉంది’.. కిరణ్ అబ్బవరం

January 10, 2023

Kiran abbavaram new movie 'Vinaro Bhagyamu Vishnu Katha' Official teaser released

రాజావారు రాణివారు, ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో రాబోతున్నాడు. తన తాజా చిత్రం విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ మూవీ టీజ‌ర్‌ని రిలీజ్ చేశారు మేక‌ర్స్. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై బన్ని వాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మురళీ కిశోర్ అబ్బురు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఫిబ్రవరి 17న సినిమా విడుదల కానుంది.

ఈ టీజర్‌ లో కిరణ్ అబ్బవరం….దుమ్ములేపారు. టీజర్ ఎలా ఉందంటే ..నా పేరు విష్ణు! మా జీవితాలు అన్నీ ఏడు కొండల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇంకొన్ని రోజుల్లో మీరందరూ చూడబోయేది నా కథ” అని హీరో కిరణ్ అబ్బవరం చెప్పే మాటతో టీజర్ స్టార్ట్ అయ్యింది. టీజర్ అంతా హీరో వాయిస్ ఓవర్ మీద నడిచింది. ‘కాన్సెప్ట్‌తో మొదలై.. లవ్వూ, కామెడీ మిక్స్‌ అయి, క్రైమ్‌ నుంచి సస్పెన్స్‌ వైపు సాగే ఇంటెన్స్‌ యాక్షన్‌ డ్రామా’ అంటూ కిరణ్‌ అబ్బవరం చెప్పిన డైలాగ్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో కశ్మీరా హీరోయిన్. మురళీశర్మ, ఆమని కీలక పాత్రలు పోషిస్తున్నారు. టీజర్ లాస్ట్ లో మురళీ శర్మ స్టెప్స్ మాత్రం నెక్స్ట్ లెవల్.. కావాలంటే మీరూ టీజర్ చూసేయండి.