కిరాణ షాప్‌లో దొంగలు...చివరకు ఏం జరిగిందంటే ? - MicTv.in - Telugu News
mictv telugu

కిరాణ షాప్‌లో దొంగలు…చివరకు ఏం జరిగిందంటే ?

February 27, 2018

పంజాబ్‌లోని అమృత్’సర్‌లో రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆరుగురు దొంగలు ఓ కిరాణ దుకాణంలోకి ఎంటర్ అయ్యారు. ముఖానికి కర్చీఫ్‌లు కట్టుకుని వచ్చి షాప్ ఓనర్ను  బెదిరిస్తూ..షాపులో సరుకులు కొనడానికి వచ్చిన వారిని కూడా బెదిరిస్తూ  డబ్బుల డ్రా తీసకున్నారు. ఇంతలో ఆ దొంగల పైకి షాప్ ఓనర్ మరియు కస్టమర్లు ఒక్కసారిగా ఎగబడ్డారు. వారిని కొడుతూ తుపాకీతో కాలుస్తున్నా కూడా ప్రతిఘటించారు.  చివరకు ఆ దొంగలు షాపులో దొంగలించిన 60 వేలు తీసుకుని అక్కడినుంచి పరారయ్యారు. ఈ ఘటన మెత్తం షాప్ లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది.  షాప్ ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ..సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.