నెట్టింట్లో కేంద్ర మంత్రి వీడియో వైరల్.. ఆ ఫీట్స్ చూస్తే.. - MicTv.in - Telugu News
mictv telugu

నెట్టింట్లో కేంద్ర మంత్రి వీడియో వైరల్.. ఆ ఫీట్స్ చూస్తే..

October 28, 2019

Kiren .

కేంద్ర మంత్రి అంటే ఎప్పుడూ శాఖాపరమైన విషయాల్లోనే బిజీగా ఉంటారని అనుకుంటారు. కానీ తాము కూడా ఫీట్స్ చేయగలమని అప్పుడప్పుడు తమలోని టాలెంట్‌ను బయటపెడుతూ ఉంటారు. ఎప్పుడూ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటే కేంద్ర క్రీడలశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు  పోస్టు చేసిన ఒక వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన వారంతా ఆయన టాలెంట్ చూసి వావ్ అంటున్నారు. 

ఈ వీడియోలో ఆయన రోప్‌ క్లైంబింగ్‌ చేస్తుండటం అందరిని ఆకట్టుకుంటోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని దిరంగ్‌ గ్రామంలో ఆయన ఈ ఫీట్ చేశారు. కొండ ప్రాంతాల్లో ట్రెక్కింగ్, మౌంటెనీరింగ్, క్లైంబింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చే నిమాస్ అనే అడ్వెంచర్ శిక్షణ సంస్థలో రోప్ క్లైంబింగ్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇలా ప్రతి మంత్రి తమ ప్రజలకు స్ఫూర్తినివ్వటం చాలా మందిలో ఆత్మవిశ్వాసం నింపుతుందని అంటున్నారు.