‘మహానటి’ అదుర్స్.. - MicTv.in - Telugu News
mictv telugu

‘మహానటి’ అదుర్స్..

September 11, 2017

అందచందాలతోపాటు నటనకు పెట్టింది పేరైన అలనాటి ప్రముఖ నటి సావిత్రి.. మరోసారి మనకళ్ల ముందు కదలాడనుంది..! కాకపోతో మరో అందాల నటి రూపంలో..! సావిత్రి జీవితం ఆధారంగా తీస్తున్న ‘మహానటి’ మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తున్న కీర్తి సురేశ్.. సావిత్రి గెటప్ తో ఉన్న ఫొటోలు బయటికొచ్చాయి. సినిమా షూటింగ్ సెట్లలో ఈ ఫొటోలను తీశారు.

మహానటి రూపంలో కీర్తి సురేశ్ చూడ ముచ్చటగా కనిపిస్తున్నారు. పెద్ద కొప్పు, పెద్ద దుద్దులు, నెక్లెస్, కాటుక కళ్లు, పట్టుచీర, చిర్నవ్వుతో ముమ్మూర్తులా సావిత్రిని తలపిస్తున్నా. మహానటి మూవీ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరెక్కుతున్న విషయం తెలిసిందే.  వైజయంతి మూవీస్‌ పతాకంపై ప్రియాంకా దత్‌ ఈ సినిమా తీస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లోనూ విడుదల కానున్న ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ, షాలిని పాండే, ప్రగ్యా జైశ్వాల్‌, సమంత కూడా నటిస్తున్నారు.