తెలంగాణలో ఆరు నెలల్లోనే ఎన్నికలు వస్తాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణకు కేంద్రం నిధుల అంశంలో బీజేపీ-బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధంలో భాగంగా ఆయన కేటీఆర్‌కు కౌంటరిచ్చారు. రాష్ట్రానికి, కేంద్రం నిధులు ఇచ్చిందని చూపిస్తే రాజీనామా చేస్తానన్న కేటీఆర్ సవాల్‌పై కిషన్ రెడ్డి స్పందించారు. ఆరు నెలల్లోపు తెలంగాణలో ఎన్నికలు వస్తున్నాయని..కేటీఆర్ మంత్రిగా ఉంటే ఏంటీ, ఊడితే ఏంటి అని ఎద్దేవ చేశారు. కేటీఆర్‌ను రాజీనామా చేయమని ఎవరడిగారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిచి తీరుతుందని..ప్రజలే కేటీఆర్‌తో రాజీనామా చేయిస్తారన్నారు. ఆరు నెలలు పోతే కేసీఆర్ కూడా శాశ్వతంగా తన ఫామ్ హౌస్‌లో విశ్రాంతి తీసుకోవచ్చని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
బండి సంజయ్ కూడా తెలంగాణ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రావొచ్చని జోష్యం చెప్పారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమని.. రాజీనామా పత్రంతో కేటీఆర్,కేసీఆర్ సిద్ధంగా ఉండాలని అన్నారు.
ఇటీవల సూర్యాపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ కేంద్రానికి తెలంగాణ రూ.3లక్షల 68వేల కోట్ల పన్నులు చెల్లించామని కానీ కేంద్రం మాత్రం తెలంగాణకు ఇచ్చింది కేవలం రూ. లక్షా 68వేల కోట్లు మాత్రమేనని తెలిపారు. దీనిపై కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన లెక్కలుపై తాను మాట్లాడింది అబద్దమైతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని..అదే కిషన్ రెడ్డి మాటలు అబద్ధమైతే రాజీనామా అవసరం లేదు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెబితే చాలని సవాల్ కేటీఆర్ సవాల్ విసిరారు.