ఈ నాటకం ఎందుకు? పోర్న్‌ తీసుకుంటే పోలా.. - MicTv.in - Telugu News
mictv telugu

ఈ నాటకం ఎందుకు? పోర్న్‌ తీసుకుంటే పోలా..

September 25, 2018

టాలీవుడ్‌లో కొత్త కథాకథనాలతో సినిమాలు వస్తున్నాయి. అందుకు సమవుజ్జీగా సినిమాల్లో మసాలాలు కూడా దట్టించేస్తున్నారు. ఈ మసాలాలు సినిమా విజయానికి ప్రామాణికం కాదు అనే వాదనలు వినిపిస్తున్నా కొందరు డైరెక్టర్లు పని గట్టుకుని ఇలాంటి సీన్లను జొప్పిస్తున్నారు. బొడ్డు చూపించడాలు, లిప్ టు లిప్ కిస్సులు, మీద పడ్డాలు, బూతు మాటలు పెట్టి సినిమాలు రూపొందిస్తున్నారు. అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 సినిమాలు హిట్ అవడానికి శ్రుతిమించిన రొమాన్సే అని భావిస్తున్నారు కొందరు దర్శక నిర్మాతలు. ఆ కోవలోకి కొత్తగా వస్తున్న ‘నాటకం’ సినిమా.

చిన్న సినిమాలు విడుదలైతే  పట్టించుకునే పురుగు వుండడు కాబట్టి మనమే సినిమాలో ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలని భావించి రూపొందించినట్టుగానే కనిపిస్తోంది నాటకం సినిమా. కథాపరంగా ముద్దులు, వాటేసుకోవడాలు, అంగాంగ ప్రదర్శనలు పెట్టినా పరవాలేదు గానీ కావల్సి పెడితే అవి జనాలకు ఎలా రుచిస్తాయి అనేదే ప్రశ్న ? ఏదైనా శ్రుతి మించితే ఎబ్బెట్టుగానే వుంటుంది. అందుకు శృంగారం కూడా మినహాయింపు కాదు. యువతనే టార్గెట్ చేస్తూ ఇలాంటి డోసెక్కువ సినిమాలు తమిళంలోనూ వచ్చాయి. తర్వాత అక్కడ నెమ్మదించాయి. కానీ యువత ఒక్కటే కాదు కదా సినిమాలు చూసే ప్రేక్షకులు ? ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వుంటారు. మన దగ్గర అర్జున్ రెడ్డి మొదలు పెట్టగా కొందరు దాన్ని పాటిస్తున్నారు.

కళ్యాణ్‌జీ గోగన దర్శకత్వంలో వస్తున్న ఈ నాటకం సినిమాలో ఎక్స్‌పోజింగ్ దృశ్యాలు హద్దులు దాటినట్టే కనిపిస్తున్నాయి. ట్రైలర్‌లో ప్రధానంగా ఈ సీన్లనే పెట్టారు. ఇలా చేస్తే ట్రైలర్ యూట్యూబ్ ట్రెండింగ్‌లో వుంటుందని సదరు దర్శక నిర్మాతల స్ట్రాటజీ అయివుంటుంది. ఇలాంటివి చూస్తుంటే సినిమా ఇప్పుడు సింగారించుకున్న వేశ్యలా మారిందనే అనిపించకమానదు. ప్రేక్షకులను విటులను చేస్తున్న ఇలాంటి సినిమాలు చాలా ఈజీగా క్యాష్ చేసుకుంటున్నాయి. ఒళ్ళు గగుర్పొడిచే ఫైటింగులు, ఛేజింగులే సాంతం వున్నట్టు కనిపిస్తోంది. యూత్ నాడిని కరెక్టుగా పట్టుకుని వస్తున్న ఈ నాటకం ఏ మేరకు ప్రేక్షకులను అలరిస్తుందనేది విడుదల అయితే గానీ చెప్పలేం అంటున్నారు సినీ విశ్లేషకులు.